మద్యం తీసుకోవద్దు బాబోయ్ అంటే అసలు వినరు ఈ కాలం ప్రజలు. మద్యం తీసుకోవడం వలన శరీరంలోని అన్ని అవ్యవయాలు దెబ్బ తింటాయి అని తెలిసిన వారు మనుకోరు. అయితే మద్యం తీసుకోవడం వల్ల మద్యం తీసుకున్న వారి శరీరాలకే కాదు పుట్టబోయే బిడ్డకు కూడా నష్టమే. ఇంకా చెప్పాలంటే మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు కూడా పుట్టారట. 


వారికీ పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆలా మానేయడం వల్ల పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 


ఇంకా మహిళలు అయితే తమ గర్భధారణకు ఏడాది ముందు నుంచే మద్యం మానేయాలని తెలిపారు. మద్యం తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల రీసెర్చ్ ఆధారంగా, 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. చూశారుగా.. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే మద్యం పూర్తిగా మానేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: