విజయ దశమి వచ్చింది.అని ఏదో సరదాగా గడిపేస్తే చాలదు ఈ విజయదశమితో మీ జీవితంలోనూ విజయం వరించాలి. ఆర్థికంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ, వియ శిఖరం చేరాలి..అలా చేరాలంటే ముందుగానే దీని కోసం తగిన ప్రణాళికలను వేసుకోవాలి. అందుకోసం దసరా కన్నా మంచి రోజు ఉండకపోవచ్చు. ఇక ఈ ఏడాది వచ్చిన దసరా నుంచి మీరు మంచి ఇన్వెస్టర్‌గా ఉండాలని భావిస్తే..మీలోని భయాన్ని, దురాశను అధిగమించేందుకు శ్రద్ధ వహించాలి. రావణుడిని కాల్చినట్లుగా, మనకు ఎదురయ్యే ఆర్థిక పాపాలను కూడా అలా కాల్చి వదిలించుకోవాలి. అందుకే ఈ దసరా రోజున తీసుకోకూడని ఆరు ఆర్థిక నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం.


1. దసరా లేదా విజయ దశమిని ఏదైనా కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలను హడావిడిగా తీసుకోకూడదు. బాగా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. అందుకే దసరా రోజున ఆర్థిక ప్రణాళికల గురించి ఆలోచించండి.మంచి ఆర్థిక జీవనానికి పునాదులు వేసుకోండి.


2. రావణుడి దిష్టిబొమ్మ దసరా రోజున దహనం చేయడం వెనుకున్న కారణం చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.కాబట్టి మనం కూడా చెడు ఆర్థిక నిర్ణయాలను వదిలించుకోవాలి.వాటిలో క్రెడిట్, డెబిట్ కార్డులను విపరీతంగా నిర్లక్ష్యంగా ఉపయోగించడం, బడ్జెట్‌కు మించి ఖర్చు చేయడం వంటిని వదిలించుకోవాలి. ఇలాంటి పనులు చేయకుండా ఉండటం మంచిది. వీటి స్థానంలో బీమా తీసుకోవడం, ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించడం వంటి నిర్ణయాలు తీసుకోండి.


3. మంచి జీవనానికి ఆర్థిక క్రమ శిక్షణ చాలా అవసరం. ఇది అంత సులభం కాదు. దీని కోసం బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. మీ ఆర్థిక వ్యవహారాలన్ని ఈ బడ్జెట్ పరిధిలోపలే ఉండేలా చూసుకోండి. దాదాపు ఎట్టిపరిస్థితుల్లోనే దాటకుండా ఉండేలా ప్లాన్ చేయండి. అలాగే క్రమానుసారంగా బడ్జెట్‌ను సమీక్షించుకుంటూ రావాలి. అవసరమైతే తగిన నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకెయ్యాలి..


4. చాలా మంది తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడి రావాలని ఆశపడుతూ ఉంటారు. దీంతో ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కీలక అంశాలను విస్మరిస్తారు.అందుకే అన్ని విషయాలల్లో అత్యాశ వద్దు. తొందపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు.


5. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు వార్తల ఆధారంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల ప్రభావంతో ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ ఉంటారు. ఇలా చేయకండి. కంపెనీ గురించి తెలుసుకోండి. స్టాక్ పనితీరు అంచనా వేయండి. మ్యూచువల్ ఫండ్స్‌తో ఇన్వెస్ట్‌మెంట్లను ప్రారంభించడం ఉత్తమం.


6. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించండి. ఎందుకంటే తప్పటడుగులు వేసారో మీరు పెట్టిన పెట్టుబడులకు అర్థం ఉండదు. అలాగే అత్యవసర ఫండ్‌ను కలిగి ఉండండి. దీంతో ఏమైనా జరిగితే మీ సేవింగ్స్ అయిపోకుండా ఉంటాయి. చూసారుగా ఈరోజు మీరు నిర్ణయించుకునే లక్ష్యం మిమ్మల్ని విజయం దరికి తప్పక చేర్చుతుందని నమ్మకంతో ముందుకు వెళ్లగలరు అప్పుడే అనుకున్నది సాధించగలరు... 

మరింత సమాచారం తెలుసుకోండి: