నేటి తరం యువత స్టైల్ అనే నెపంతో ఒకప్పుడు పచ్చ బొట్టుని టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. నాటి కాలపు పచ్చ బోట్లను ఇప్పుడు స్టైల్ గా టాటూ అని పిలుస్తున్నారు. చిన్న చిన్న టాటూలు వేయించుకునే వారి నుంచి ఒళ్ళంతా టాటూలు వేయించుకునే వారి వరుకు అందరిని చూస్తుంటాము. వివిధ రకాల టాటాలను వేసుకుంటుంటారు ఈ తరం యువత. 


కొంతమంది ఫ్యాషన్ గా వేసుకుంటే మరికొందరు ప్రేమకు గుర్తుగా ఇవి వేసుకుంటుంటారు. రాయితీ ఈ టాటూలలో రెండు రకాలు ఉన్నాయి. పచ్చబొట్టు మాదిరి చేరగనివి, కావాలనుకున్నప్పుడు చెరిపేసుకునేవి. అయితే ఈ టాటూలు వేయించుకునే వారి కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే చర్మ సమస్యల భారిన పడాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు ఏవో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


అర్హత, నైపుణ్యం ఉన్నవారి చేతే టాటూ వేయించుకోవాలి. ఈ విషయంలో రాజీ పడితే చర్మ సమస్యలు వస్తాయి.


గతంలో టాటూ వేయించుకొని చర్మ సమస్యల బారిన పడినవారు ఈ విషయాన్ని ముందుగా టాటూ డిజైనర్ కు చెప్పాలి.


ఆలోచనలు, అభిరుచులు కాలంతో పాటు మారతాయి కనుక కోరుకున్నప్పుడు చెరిపేసుకొనే టాటూలు వేయించుకోవటం మంచిది.


అనారోగ్యంతో ఉన్న సమయంలో టాటూ వేయించుకోవద్దు.


టాటూ వేయించుకొనే ముందు మద్య పానం, మత్తు పదార్ధాలను సేవనం పనికిరాదు.


టాటూ కోసం వాడే రసాయనాలు, వాటి మూలంగా వచ్చే తలెత్తే ప్రతికూల ప్రభావాల గురించి ముందే తెలుసుకోవటం మంచిది.


సున్నితమైన ప్రదేశాల్లో టాటూలు వేసేప్పుడు లోకల్‌ అనస్థీషియా తీసుకోవటమే మంచిది.


ఎండలో బయట వెళ్ళడానికి ముందు టాటూ మీద సన్ స్క్రీన్ లోషన్ రాసుకొంటే మంచిది.


టటూ వేయించుకున్న తొలిరోజుల్లో మాయిశ్చరైజ్ రాయటం వల్ల ఇన్ఫెక్షన్స్, వాపు, వంటివి త్వరగా తగ్గుతాయి.


టాటూ మీద స్క్రబ్బింగ్ పేరుతో ఎడాపెడా రుద్దితే టాటూ చెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి.


టాటూ వేయించుకొన్నవారు స్నానానికి నాణ్యమైన సోపును వాడాలి.


మహిళలు వాక్సింగ్ చేయించుకోవాలనుకుంటే టాటూ వేయించుకోవడానికి ముందే చేయించుకోవటం మంచిది.


టాటూ వేసిన చోట చర్మం పొడిగా, వాపుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 


ముఖ్యంగా గుర్చించుకోవాల్సిన జాగ్రత్త .. శారీరక పరీక్షలు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువత శాశ్వత టాటూల జోలికి వెళ్లకపోవటమే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: