న‌ల్ల‌మిరియాలు ప్రాచీనకాలం నుండి భారతదేశంలో మసాలా దినుసుగా ఉపయోగపడుతుంది. సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియం అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ స్పిచెస్ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి.మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఆహారంలో రుచిని పెంచడానికి మిరియాల ఘాటు తగలాల్సిందే. వంటల్లోనే కాదు.. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు.  ఇది ఎక్కువగా మలబార్‌, మైసూర్‌, కొచ్చిన్‌ ప్రాంతాల్లో పండుతుంది.


న‌ల్ల‌మిరియాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వల్ని విచ్చిన్నం చేయడంతో పాటు కొత్త కొవ్వు కణ నిర్మాణాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్ల మిరియాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క సాంద్రతను పెంచుతాయి. బ‌రువు త‌గ్గించ‌డంలో ఇవి గ్రేట్‌గా ప‌ని చేస్తాయి. క్ పెప్పర్ రక్తనాలల్లో ఏర్పడే కొవ్వును నిరోధిస్తా యి. అందువల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గడంతో పాటు గుండెకు రక్త సరఫరా బాగా జరిగి గుండె పోటు తగ్గించుకోవచ్చు.


బ్లాక్ పెప్పర్ శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. అదేవిధంగా మలేరియా జ్వరానికి మిరియాలు, శొంఠి, తులసి, పంచదార కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. సో న‌ల్ల‌మిరియాల‌ను మ‌నం తినే ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: