స‌హ‌జంగా ప్రతిరోజూ తలస్నానం చేయడం కొంత మందికి అలవాటు. మ‌రికొంద‌రికి వారానికి ఒక సారి చేస్తుంటారు. తలస్నానం చెయ్యడం, వినడానికి ఎంతో సులభంగా అనిపించినా, ఎక్కువ మంది తప్పు పద్దతిలో జుట్టుని వాష్ చేస్తారు. చాలా మంది తలస్నానానికి వేడినీళ్ల ఎక్కువగా వాడుతుంటారు. ఇది అంత మంచివి కాదు. ఎందుకంటే వేన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా డ్రై అవుతాయి. వేడి నీళ్లకు బదులు గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది. 


అలాగే క్రమం తప్పకుండా తలస్నానం చేస్తే ఉత్పత్తి అయ్యే నేచురల్‌ ఆయిల్స్‌ కోల్పోతారు. వాటిని తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది. అలాగే హెయిర్‌ ఫాల్‌ ఎక్కువ అవుతుంది. కాబట్టి రోజు మార్చి తలస్నానం చేయడం ఉత్తమం. షాంపుతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపు, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి. అలాగే షాంపు, కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా చేయాలి. 


అదే విధంగా త‌ల స్థానం చేసిన వెంట‌నే  జుట్టుని దువ్వకండి. జుట్టు చిట్లి, పాడైపోయే అవకాశం ఉంటుంది. జుట్టు బాగా తడి ఆరాక దువ్వితే మంచిది. పొడవాటి జుట్టు ఉన్నవారు జుట్టును తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇతర జుట్టు రకాలతో పోలిస్తే దట్టమైన జుట్టు ఉన్న వారికి ఆయిల్, జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు కాకుండా వారానికి రెండు సార్లు త‌ల‌స్నానం చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: