ఆడ‌వారికి శిరోజాలు ఇచ్చే అందం అంతా.. ఇంతా కాదు. స‌హ‌జంగా జుట్టు ఒత్తుగా.. సిల్కీగా.. ఉంగరాలు తిరిగి.. పలచగా.. ఇలా ఎన్నో రకాలుగా జట్టు ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి చాలామంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. కానీ ఎన్ని చిట్కాలు ఉప‌యోగించినా ప్ర‌యోజ‌నం లేక మ‌రింత బాధ‌ప‌డుతుంటారు.


జుట్టు రాల‌డానికి అస‌లు కార‌ణం.. కాలుష్యం, పోషకాహార లోపం,  వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాలు జుట్టు ఊడిపోవడానికి, తెల్లబడడానికి కారణాలు. అలాగే కెమికల్స్‌తో తయారైన హెయిర్‌ ప్రాడెక్టులు వినియోగించడం, జడను బిగదీసి వేసుకోవడం, సి విటమిన్‌ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవ‌డానికి కార‌ణాలు.


ఇక మన తలపై సుమారు లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. అందులో సాధారణంగానే రోజుకు సుమారు 100 వరకు వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి. చర్మ కణాలు, వెంట్రుకల పెరుగుదల క్రమంలో ఇది నిత్యం జరుగుతూ ఉండేదే. అయితే 100 వరకు వెంట్రుకలు అంటే మనం పెద్దగా గుర్తించలేం. కానీ ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతున్నాయంటే మాత్రం ఖ‌చ్చితంగా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం.


మరింత సమాచారం తెలుసుకోండి: