చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ప్రతి ఇంట్లో చిన్న పిల్లల అకేషన్స్‌లో తప్పని సరిగ్గా ఈ చాక్లేట్స్‌ను పెడతారు. కొంతమందికి ఈ చాక్లేట్స్ అంటే ఇష్టం ఉంటుంది కాని తినడానికి భయపడతారు. ఆ భయమేమి అక్కర్లేదట. ఇకపోతే  మీరు క్యాండీ, చాక్లెట్ల ప్రియులైతే తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే. క్యాండీ, చాకెట్లు తింటున్నారా ? అయితే మీ ఆరోగ్యానికి మేలేనని సర్వే చెబుతోంది. క్యాండీలు, చాకెట్లు తినడం ద్వారా ఆరోగ్యానికి కీడు చేసే రోగాలు దరిచేరవని లూజియానా స్టేట్ యూనివర్శిటీ అగ్రికల్చురల్ సెంటర్ నిర్వహించిన స్టడీలో తేలింది. క్యాండీలు, చాక్లెట్లను ఇష్టపడి తినే వారు బరువుకూడా తగ్గిపోతారని ఆ సర్వే తేల్చింది.


ఇకపోతే చాక్లెట్ తినడమనే విషయంలో చాలామంది పెద్దవాళ్ళల్లో అపోహ ఉంది. చాక్లెట్‌లు తినడానికి తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కాని మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు, పెద్దలకు కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు. ఐతే మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీనాలని సూచిస్తున్నారు. మంచి ఆహారంతో పాటు చాక్లెట్ కూడా డైట్‌లో బాగంగా ఉండాలని వైద్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో వుండే పాలీ ఫెనాల్స్ చర్మానికి. గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయంటున్నారు వైద్యులు.


చాక్లెట్ తినడం వల్ల దంతాలు పాడైపోతాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. కానీ మనం తినే చాక్లెట్ నోట్లోనే కరిగిపోతుంది కావున అది దంతాలకు హానీ చేసే అస్కారం ఉండదు. అలాగే చాక్లెట్స్‌లో అరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలనే ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ సృష్టం చేసింది.  మరి ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, అలాగే డార్క్ చాక్లెట్‌లలో మెగ్నీషియం, రాగి, ఇనుము  లాంటివి సమ‌ృద్దిగా లభిస్తాయని అవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు. మరి చాక్లేట్స్ తినడంలో సంకోచం ఎందుకు ఇక మొదలెట్టండి అంటున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: