మనలో చాలా మంది కావలసినంత డబ్బులుంటే హాయిగా తిని పడుకోవచ్చని ఆలోచిస్తారు. అంతేకాదు వారి ఆలోచనలకు తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తారు. కాని ఓ మెగాస్టార్ కోడలై వుండి. స్టార్ హీరోకు భార్యగా పెద్ద సంస్ధకు ఎండీగా వుంటూకూడా సమయాన్ని వృధా చేయకుండా తనకు విరామం వద్దని మనస్సుకు నచ్చిన పని చేస్తున్నారు. ఇంతకు ఎవరనుకుంటున్నారా ? ఆమె ఉపాసన కామినేని కొణిదెల..


రామ్ చరణ్ భార్యగా పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. రామ్ చరణ్ భార్యగానే కాదు, అపోలో లైఫ్ ఎండీగానూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాదు.. ఆమె ఓవైపు పెద్ద గ్రూపు ఆసుపత్రులకు ఎండీగా ఉంటూనే తన మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. అదేమంటే తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానలను నిర్వహిస్తున్నారు. అదే ఉపాసన కామినేని కొణిదెల యూట్యూబ్ ఛానల్.. ఈ ఛానల్ ద్వారా అందం, ఆరోగ్యం, మెరుగైన లైఫ్ స్టయిల్ టెక్నిక్స్ తన అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా వంటింటి చిట్కాలను కూడా అందిస్తారు. అదీగాక ఈ ఉపాసన యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు లక్షా 30 వేల మంది సబ్ స్క్రయిబర్స్ కూడా ఉన్నారండోయ్..


ఇక 2017 సెప్టెంబర్ లో ప్రారంభించిన ఈ ఛానల్ కు ఇప్పటి వరకూ కోటి కి పైగా వ్యూస్ వచ్చాయట. కేవలం హెల్త్ టిప్స్ మాత్రమే కాదు.. తన ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు కూడా ఇందులో అప్ లోడ్ చేస్తున్నారట. జీవితంలో సక్సస్ అయిన వారితో ఇంటర్వ్యూలు, మానసిక ఆరోగ్యం , శారీరక ఆరోగ్యం రెంటినీ మెరుగుపర్చుకునే అంశాల్లో విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. కొన్నిసార్లు ఈ విషయాల్ని పోషకాహార నిపుణులూ, సెలెబ్రిటీ చెఫ్ లతో పాటుగా ఫిట్నెస్ టైనర్లతోనే చెప్పిస్తున్నారట..


ఇక ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇప్పటివరకూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్, సమంతా, పీవీ సింధు…ఇలా చాలా మంది ప్రముఖుల జీవనశైలి గురించి ఇంటర్వ్యూలు చేశారట ఉపాసన కామినేని కొణిదెల.. చూసారా మెగాస్టార్ కోడలని ఖాళీగా కూర్చోకుండా తనపని తాను చేసుకుంటూ, చెర్రీకి కూడా సహాయం చేస్తూ తన లైఫ్‌ను ఎంత హ్యాపీగా గడిపేస్తుందో ఉపాసన అని అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: