ధనియాల మొక్కల నుండి వ‌చ్చే కొత్తిమీర మంచి సువావన కలిగి ఉంటుంది. తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో విరివిగా వాడతారు. జీర్ణ సమస్యలను తగ్గించడంలో కొత్తిమీరను మించిన పదార్థం లేదు. దీనిని కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. 


అయితే ప్రతిరోజూ ఉదయం పరగడపునే కొత్తిమీర జ్యూస్‌ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డానికి ఇది బాగా ఉప‌యోగ‌క‌రం.  కొత్తిమీరలోని ప్రత్యేక గుణాలు కిడ్నీల్లోని రాళ్లను బయటికి పంపడంలో సహాయపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు కలిగిన కొత్తిమీర రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వైరల్‌ ఫీవర్స్‌, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.


కొత్తిమీర జ్యూస్ వ‌ల్ల‌ చర్మసమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు తీవ్రమైన చర్మరుగ్మతలను నివారిస్తాయి. రక్తహీనతను నివారించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఆక్సిజన్ ప్రసరణను మెరుగు పరుస్తుంది. హైబీపీ ఉన్నవారు రోజూ ఉదయాన్నే కొత్తిమీర జ్యూస్‌ తాగితే బీపీ కంట్రోల్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: