బంగారం అంటే భారతీయులకు ఆభరణం మాత్రమే కాదు అది వీరికి ఓ సెంటిమెంట్ కూడా. అందుకే  భారతీయులకున్న ఈ సెంటిమెంట్ కారణంగా కొన్ని పండుగల సమయాల్లో మార్కెట్లో వేలకోట్ల వ్యాపారం జరుగుతుంది.. ముఖ్యంగా అక్షయ తృతీయ తర్వాత ధంతేరాస్ ఈ రెండు శుభదినాల్లో నగల షాపులు జనంతో కిటకిట లాడుతుంటాయి.  అంతేకాదు బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే వారు అక్షయ తృతీయ, ధంతేరాస్‌ లాంటి శుభదినాల్లో పసిడిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. ధర ఎక్కువైనా సరే ఆలోచించకుండా కొంటూ ఉంటారు.


ఇకపోతే దగ్గర్లోనే ఉన్న దీపావళి  దానికు ముందు ధంతేరాస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి వారికోసం  అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని టాప్ జువెలరీ కంపెనీలు బంగారు ఆభరణాలపై డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. వాటిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రెండు రకాల ఆఫర్లు అందిస్తోంది. రూ.15,000 విలువైన బంగారం కొనుగోలు చేస్తే ఒక బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తోంది.. తనిష్క్ డైమండ్ జువెలరీ వ్యాల్యూలో 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది అలాగే గోల్డ్ జువెలరీ మేకింగ్ చార్జీల్లో 25 శాతం తగ్గింపు కూడా ఆఫర్ చేస్తోంది..


జోయాలుక్కాస్ కూడా అదిరే ఆఫర్లు అందిస్తోంది. దీపావళి మెగా గోల్డ్ ఫెస్ట్ పేరుతో కస్టమర్లకు 200 మిల్లీ గ్రాముల ఉచిత గోల్డ్ కాయిన్ అందిస్తోంది. రూ.50,000, ఆపైన గోల్డ్ జువెలరీ కొనుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.50 వేలు, ఆపైన డైమండ్ జువెలరీ కొనుగోలుపై 1 మిల్లీగ్రాము గోల్డ్ కాయిన లభిస్తుంది.. పీసీ జువెలర్స్ గోల్డ్ కాయిన్స్‌పై 7 శాతం తగ్గింపు అందిస్తోంది. డైమండ్ జువెలరీ, గోల్డ్ జువెలరీ మేకింగ్ చార్జీలపై 30 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ మేకింగ్ చార్జీల్లో కూడా 10 శాతం తగ్గింపు ఉంది...


సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ధంతేరాస్ ఫెస్టివల్ అందిస్తోంది. గోల్డ్, డైమండ్, ప్లాటినం జువెలరీపై రూ.600 డిస్కౌంట్ పొందొచ్చు. రూ.20,000కు పైన కొనుగోళ్లకు ఇది వర్తిస్తుంది. దీని కోసం ధన్600 ప్రోమో కోడ్ వాడాలి. అదే ధన్1900 ప్రోమో కోడ్ ఉపయోగిస్తే రూ.1,900 తగ్గింపు వస్తుంది.. ఇకపోతే అన్ని బ్యాంకుల కార్డులపై డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్ని పరిమితకాలం వరకే ప్రకటించారు షాపు యజమానులు..మరెందుకు ఆలస్యం ఈ పండగను సరికొత్త అభరణాలతో ఆనందంగా గడపండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: