కావాల్సిన ప‌దార్థాలు:
అల్లం- 1 కిలో
ధనియాలు- 50గ్రా
పసుపు- అర టీస్పూన్‌
పుట్నాలు- పావు కిలో


పచ్చిమిర్చి- అర కిలో
క‌రివేపాకు- 50గ్రా
నూనె- 100గ్రా
వెల్లుల్లి- 50గ్రా


జీలకర్ర- 50గ్రా
బెల్లం- 1 కిలో
ఉప్పు- 150గ్రా 


తయారీ విధానం:
ముందుగా అల్లం పొట్టు తీసి ముక్కలుగా కోసుకుని ఒక ప్లేటులో ప‌క్క‌న పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి, అందులో నూనె వేసి అల్లం ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. దీనికి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ జత చేసి కొద్దిసేపు అన్నింటినీ వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి అందులో పుట్నాలు, బెల్లం, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 


అంతే నోరూరించే అల్లం చట్ని రెడీ.. సాధార‌ణంగా అల్లం ఓ ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.  షుగర్ జబ్బు నియంత్రణలో అల్లము శక్తివంతమైన ఔషధమంలా ప‌నిచేస్తుంది. అలాగే అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. సో.. అల్లం చట్నీ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: