ప్రపంచంలో భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం. సియాచిన్ అతి ఎత్తు అయినా యుద్ధ క్షేత్రం. అయితే సియాచిన్  ఓ మృత్యు క్షేత్రం అని మాత్రం ఎవరికి తెలియదు. ఇప్పటికే వందలాది మంది సైనికులను ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల లాన్స్ నాయక్ హనుమంతప్ప అతని తొమ్మిదిమంది అనుచరులను కూడా చనిపోవడం జరిగింది. ఇలా  ప్రతి నెలా మంచుకొండ చరియలు విరిగిపడటం ద్వారానో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు అక్కడ ఏర్పడటం మూలంగానో కనీసం ఒక్కరు లేదా ఇద్దరు సైనికులు ప్రాణాలు వదులుతుంటారు. ఇలా  జరగడం ఇప్పటిదేం కాదు.. 1984 నుంచే మొదలు అయంది.


మొట్టిటి  సారి పాకిస్థాన్ సైన్యాన్ని  ఎలాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో  దాదాపు 22వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1984 నుంచి అక్కడ భారత సేనలను నిలపడం మొదలుపెట్టారు. ప్రభుత్వం లోకసభలో ప్రకటించిన ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్ వద్ద చనిపోవడం జరిగింది అని తెలిపారు.


ఎక్కువగా  2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్లో మృత్యువాత పడిపోగా . 2015 ఐదుగురు చనిపోవడం జరిగింది. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీ కోసం దాదాపు వేల కోట్లు ఖర్చు చేస్తుంది అంట. ఒక్క 2012-13, 2014-15 మధ్యనే రూ.6,566 కోట్లు ఖర్చుచేయడం జరిగింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వాతారోహణ సామాగ్రి ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలు ఉండటం సర్వసాధారణం. ఈ చలిని తట్టుకోవడం సాధారణ పౌరులకు సాధ్యం కాదు. . ప్రతి ఏటా మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు చేస్తారు.


మన సైన్యం వారిపై పొరపాటున కూడా కాల్పులు జరపదని తెలిసినా ఆ దేశ సైన్యం పాక్ సరిహద్దు సియాచిన్ మంచు పర్వతాల్లో పహారా కాస్తూనే ఉంటుంది. పాక్ సైనికులు కూడా మంచు ప్రమాదాల బారిన పడి ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. అయినా దేశ రక్షణ కోసం సియాచిన్‌లో సైనికుల పహారా తప్పడం లేదు ఇరు దేశాలకు.


మరింత సమాచారం తెలుసుకోండి: