కావాల్సిన పదార్థాలు:
పనీర్‌- 100 గ్రాములు
కొత్తిమీర- కొద్దిగా
నూనె- సరిపడా
ఉప్పు- తగినంత


గుడ్డు- ఒకటి
పాలు- 1 కప్పు
క్యారెట్ త‌రుగు- 1 క‌ప్పు
క్యాబేజీ తరుగు- 1 కప్పు


మిరియాల పొడి- 1 టేబుల్‌ స్పూన్‌
సోయా సాస్‌- 1 టేబుల్‌ స్పూన్‌
మైదా- 6 టేబుల్‌ స్పూన్లు


తయారీ విధానం: 
ముందుగా ఒక గిన్నెలో ఎగ్‌, పాలు, మైదా, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో రెండు చెంచాల నూనె వేసి కూరగాయ ముక్కలు పనీర్‌ తురుము, మిరియాల పొడి, సోయాసాస్‌, ఉప్పు వేసి బాగా వేగాక దించేయాలి. ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె రాసి మైదా మిశ్రమాన్ని దోశలా వేసి రెండు వైపులా కాల్చాలి. 


అందులో కూరగాయ ముక్కల్ని ఉంచి రోల్‌లా చుట్టి ఒక ప్లేట్‌లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారాక రెండు చివర్ల అంచుల్ని మూసి కాగిన నూనెలో ఒక నిమిషం పాటు వేయిస్తే పనీర్ స్పింగ్‌ రోల్స్‌ రెడీ.. వేడి వేడిగా సోస్‌తో వీటిని తింటే చాలా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: