సాధార‌ణంగా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండ‌రు. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయని తెలుసు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ వంటివి తయారుచేస్తారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా చేసుకుంటారు. ఇలా ర‌క‌ర‌కాలుగా మొక్క‌జొన్న‌ల‌ను వాడుతుంటారు. అయితే మొక్క‌జొన్న‌లో ఎన్నో రకాలుంటాయి. 


ముఖ్యంగా ఇందులో ఊదారంగు మొక్కజొన్నలు దొరుకుతుంటాయి. అయితే ఊదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అంటున్నారు నిపుణులు. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు. ఊదారంగు కార్న్‌లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్ మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు.


అలాగే మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి య‌వ్వ‌నంగా కనిపించేలా చేస్తాయి. అదే విధంగా మొక్కజొన్నలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇది కోలన్ క్యానర్ ప్రమాదం నుండి ర‌క్షిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: