బొద్దింకలు ఇవి చేసే ఇరిటేషన్ అంతా ఇంతా కాదు.కొందరు హిట్ వాడతారు,మరి కొందరు మార్కెట్ లో దొరికే ముందులు వాడతారు.కానీ ఒకరు మాత్రం ఒక పెద్ద స్కెచ్ వేసాడు చివరికి అది ఊహించని షాక్ బొద్దింకలు చావడం మాట ఎలా ఉన్నా.. అతడు చేసిన పని మాత్రం పెద్ద వైరల్ అయిపోయింది.


సీజర్ ష్మిత్జ్ అనే వ్యక్తి తన భార్యను భయపెడుతున్న బొద్దింకలపై యుద్ధం చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఆమెపై ఉన్న ప్రేమతో వాటిని ఎలాగైనా హతమార్చలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. బొద్దింకలను చంపాలంటే మార్కెట్లో దొరికే మందులను వాడకుండా  ఆ బొద్దింకల్లో ఒకటి కూడా బతకడానికి వీలు లేకుండా అంతం చేయాలని ఒక పెద్ద ప్లాన్ వేసాడు.


ఇందులో భాగంగా ఆ బొద్దింకలు ఎక్కడి నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయో అక్కడి నుండి ప్లాన్ వేసుకోవడం మొదలు పెట్టాడు. చివరికి వాటి చిరునామా కనిపెట్టి. అవి తన ఇంటి వెనుక ఉన్న పచ్చిక ప్రదేశాల్లో కేంద్రంగా తన ఇంటిపై దాడి చేస్తున్నాయని కనిపెట్టి. వాటి గూడుకు మంటపెట్టి లేపేస్తే మొత్తం సమస్య తీరిపోతుంది అని ఫిక్స్ అయిపోయాడు.


బొద్దింకలు గూడుకు దారి తీసే కన్నాన్ని  తెలుసుకొని. అందులోకి గ్యాసోలిన్‌ను వేసి చూశాడు. గార్డెన్ అడుగున బొద్దింకలు ఏర్పాటు చేసిన బుల్లి సొరంగాలను కనిపెట్టి వాటి మొత్తం  ఆ పదార్థం చేరేలా చూసుకొని. ఆ తర్వాత  అగ్గిపుల్లను గీశాడు.  అయితే, అది సక్సెస్ కాలేదు. దాంతో రెండోసారి మళ్లీ వేశాడు. చివరికి మూడోసారి వేసిన అగ్గిపుల్ల సక్సెస్‌ఫుల్‌గా గ్యాసోలీన్‌ను తాకింది. అంతే, ఊహించని విధంగా గార్డెన్ మొత్తం కాలి పోయింది.గ్యాసోలిన్ పేలుళ్లకు లాన్‌తోపాటు గార్డెన్‌లో ఉన్న టేబుల్ సహా అన్ని  పైకి లేచి ఎగిరిపడ్డాయి. ఈ అనుకోని  బాంబ్ పేలుళ్లకు అతడి పెంపుడు కుక్కలు అన్ని భయపడి కోమాలోకి వెళ్లాయి.ఈ ఘటన అతడి ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఆ వీడియోను సీజర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.ఇంకేముంది అందరి ఫోన్లలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: