మనం తినే డ్రై ఫ్రూట్లలో పిస్తా ప‌ప్పు ఒక‌టి. వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఇందులో  పొటాషియం అత్యధికంగా లభిస్తుంది. ఇది మన శరీరంలోని ద్రవాల నియంత్రణకు ఎక్కువగా పనిచేస్తుంది.


ఇక మిగిలిన డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. పిస్తా పప్పులో విటమిన్ బి6 అధికం. ఇది హిమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తుంది.  విటమిన్ బి6 రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లకు దూరంగా, శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ప్ర‌తి రోజు గుప్పెడు పిస్తా ప‌ప్పు తిన‌డం వ‌ల్ల శరీరానికి సరిపడా విటమిన్ ‘ఇ’ అందుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.


పిస్తా ప‌ప్పు నుంచి కెరోటినాయిడ్లూ, లూటిన్ అధికంగా లభిస్తాయి. ఇవి కంటిచచూపుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పిస్తాలో గుండె జబ్బులను తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. వీటిని రోజు తీసుకుంటే గుండె వత్తిడి నుండి కాపాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అదే విధంగా పిస్తాపప్పు మధుమేహాన్ని నిరోధిస్తుంది. క్యాన్సర్‌లు రాకుండా కాపాడడంలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: