మనుషులు మారుతున్నారు. వారితో పాటే తరం మారుతోంది అభిరుచులు కూడా మారుతున్నాయి.. ఇక ఒక తరం మారేలోపే టెక్నాలజీ మరో తరంలోకి మారిపోతోంది. అలా 2జి, 3జి, 4జి వచ్చాయి. వాటిని దాటి ఇప్పుడు 5జి దశ వచ్చేసింది. ఇక దక్షిణ కొరియా, అమెరికా, చైనా తదితర దేశాలు ఇప్పటికే 5జి వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మనదేశం మాత్రం ఇంకా పరీక్షల స్థాయిని కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడిప్పుడే 5జి టెక్నాలజీ దిశగా మనదేశం అడుగులు వేస్తోంది. మోదీ సర్కారు 5జి సాంకేతికతను దేశంలో 2020 నాటికి  ప్రవేశపెట్టే దిశగా  కసరత్తు చేస్తోంది..


ఇకపోతే 5జి అడ్వాన్స్‌డ్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. సరికొత్త టెక్నాలజీకి ప్రతిరూపమైన ఈ 5జి . మెరుపు వేగంతో డేటా డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందించే సెల్యూలర్‌ టెక్నాలజీ.  దీని ద్వారా సెకన్‌కు 2 గిగాబిట్ల నుంచి 20 గిగాబిట్ల వేగంతో సమాచార మార్పిడి చేయవచ్చు. మనదేశంలో ప్రస్తుతం వాడుతున్న 4జి లింక్‌ వేగం 6 నుంచి 7 మెగాబిట్లు మాత్రమే ఉంది. అదే 5జి టెక్నాలజీ వాడే యూజర్లు క్షణాల్లో ఎంత భారీ సమాచారాన్నైనా  డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు. 8కె రిజల్యూషన్‌ ఉన్న సినిమాలయినా, భారీ గ్రాఫిక్స్‌ ఉండే గేమ్స్‌ అయినా క్షణాల్లో డౌన్‌లోడ్‌ అవుతాయి.


సమాచార మార్పిడి, భారీ స్థాయిలో అప్లికేషన్లను ఒకేసారి నిర్వహించడం లాంటి పెద్ద అవసరాలకు 5జి వెన్నముకలా నిలుస్తుంది. డ్రైవర్‌ రహిత వాహనాలను నడిపించడం, టెలిఫోన్‌ సేవల ఆధారంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం, రియల్‌ టైం డేటా విశ్లేషణలో 5జి టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుంది. ఐతే, మార్కెట్లో 5జి వస్తే యూజర్లు దానికి సరిపోయే ఫోన్లలోకి మారాల్సి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు 5జి వాడాలంటే చాలా సమయం పట్టొచ్చు. మార్కెట్లోకి 5జి సేవలు వచ్చినా ఇప్పటివర కున్న 2జి, 3జి, 4జి సేవలు కొనసాగుతాయి. కొత్త సాంకేతికలోకి పూర్తిగా మారడానికి మరో పదేళ్లు పట్టే అవకాశముంది.


ఇకపోతే  4జి సేవలు అందుబాటులోకి వచ్చాకా ప్రతివారు మోబైల్‌ను విడిచిపెట్టక రోజులో ఎక్కువ శాతం వరకు బానిసగా మారారు. ఇక 5జి వస్తే జరిగే మార్పులను ఊహించడం మాత్రం కష్టమే అని చెబుతున్నారు సాఫ్ట్‌వేర్ నిపుణులు. ఇప్పటికే సెల్‌కు బానిసలుగా మారి ఉన్న ఉద్యోగాలతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు 4జికే ఇలా జరుగుతుంటే 5జి మాత్రం ఊరుకుంటుందా మానవుని మెదడును తొలచి పిచ్చివానిగా మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఒకరకంగా చెప్పాలంటే 5జి వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనపెడితే అనర్ధాలకు మాత్రం ఎక్కువగా ఆస్కారం ఉందంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: