భార్యకి భర్త పై భర్తపై భార్యకు నమ్మకాలు తగ్గుతున్న కాలాలు ఇవి .ఇలాంటి కాలంలో భారత దేశం ఒక రికార్డు సృష్టించింది  అని చెప్పాలి అది వివరాల్లోకి వెళితే''నా స్నేహితుల గురించిన వ్యక్తిగత సాన్నిహిత్య వివరాలు నా భర్తకు తెలుస్తున్నట్లు అనిపించింది. అప్పుడు మొదలైంది.. ఇదంతా'' అంటారు భార్య ''అతడు మాట్లాడేటపుడు అక్కడక్కడా కొన్ని విషయాలు ప్రస్తావిస్తుంటాడు.

ఇతరుల గురించి తెలుసన్నట్లు. అవి నిజంగా వ్యక్తిగత విషయాలు. ఆయనకు తెలిసివుండే అవకాశం లేదు. ఆ విషయాలు నీకు ఎలా తెలుసు అని నేను అడిగితే.. నేనే చెప్పానని అంటాడు.. నేనే చెప్పిన విషయం నేను మరచిపోయానని నన్ను నిందిస్తాడు.''ఒక్కోసారి.. నేను ఒక కేఫ్ దగ్గర స్నేహితులను కలిసినప్పుడు.. తను అనుకోకుండా అటుగా వెళ్తూ అక్కడ నన్ను చూశానని చెప్పేవాడు. ఇక నేను ప్రతి విషయాన్నీ అనుమానించటం మొదలుపెట్టాను. నా స్నేహితులను సైతం సందేహించేదానిని.''

ఇలా కొన్ని నెలల పాటు అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అవి అంతకంతకూ పెరుగుతోంటే.. అమీ వైవాహిక బంధం వేధింపులతో పీడకలగా మారింది.ఒక పండుగ నాడు కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లినపుడు భయంకరమైన ఆ నిజం తెలిసింది.మేం ఒక గుమ్మడి తోటను సందర్శించటానికి వెళ్లాం. ఆ వారాంతపు సెలవు సంతోషంగా గడుస్తోంది.తోటలో తీసిన ఒక ఫొటోను చూపించటానికి నా భర్త తన ఫోనును నాకు అందించాడు. ఆ అర క్షణంలోనే ఆయన ఫోను స్క్రీన్ మీద ఒక అలర్ట్ పాపప్ అయింది. మీ భార్య మీద రోజు వారీ నివేదిక సిద్ధంగా ఉంది' అని ఆ అలర్ట్ చెప్తోంది.


నా వెన్నులో వణుకుపుట్టింది. ఒక నిమిషం పాటు ఊపిరి తీసుకోవటం కూడా మరచిపోయాను. నేను టాయిలెట్‌కి వెళ్లాలంటూ పక్కకు వెళ్లి పోవాల్సిపోవాల్సి వచ్చింది. నా కొడుకు కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఏమీ చూడనట్లు నటించాల్సి వచ్చింది.స్టాకర్‌వేర్ - స్పౌజ్‌వేర్ అని కూడా అంటారు - అనేది ఒక శక్తివంతమైన నిఘా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. దీనిని ఆన్‌లైన్‌లో బాహాటంగా అమ్ముతున్నారు.స్టాకర్‌వేర్ వినియోగం అత్యధిక స్థాయిలో ఉన్న దేశం రష్యా అని కాస్పర్‌స్కీ లెక్కలు సూచిస్తున్నాయి. రష్యా తర్వాతి స్థానం ఇండియా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: