రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట.. వైఎస్ లైఫ్ టైమ్ అవార్డు ఇస్తామని మంత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రకటించారు కూడా. అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రెండు, మూడు రోజుల్లోనే ఆ అవార్డుకు ఓ వ్యక్తి ఖరారైపోయారు.


అతడే దర్మాడి సత్యం.. గోదావరి పడవ మునక ప్రమాదంలో నీటిలో మునిగిపోయిన పడవను వెలికి తీసింది ఈ ధర్మాడి సత్యం బృందం.. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న సంస్థలు కూడా బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించలేకపోయినా.. ధర్మాడి సత్యం బృందం సాహసోపేతంగా ప్రయత్నించింది.


విశాఖ నుంచి డైవర్లను రప్పించి మారీ ఆపరేషన్ కొనసాగించారు. మొత్తానికి బోటును వెలికి తీయగలిగారు. బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం గారిని ఈ అవార్డు తొలిసారిగా వరించబోతోంది. అసమాన్య పనిచేసినందుకు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకొని అతనికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని, అది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కమిట్‌మెంట్‌ అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: