కొత్తిమీర‌ను కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా ఔషధంగా కూడా వాడవచ్చు. కొత్తిమీరను సాధారణంగా వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలోనూ,  గార్నిష్‌కూ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది ఒక శక్తివంతమైన ఆకుకూర. కొత్తిమీరను ఎక్కువగా కూరల్లోనూ, పచ్చడిగానూ చేసి వాడుకుంటుంటారు. కొత్తిమీర రుచి, సువాసనతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది అనేక వ్యాధుల చికిత్సలోఉపయోగిస్తుంది. కొవ్వు, మినరల్స్, పీచు, కార్బొహైడ్రేట్స్ ఉంటాయి.


విటమిన్ సి,ఎ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, సోడియం, పొటాషియం, ఆగ్జాలిక్ యాసిడ్స్ ఉంటాయి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీళ్ళనొప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును. లివర్ సక్రమంగా పనిచేయడానికి, డయేరియా కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంది. ముఖం మీద మచ్చలు పోగొడుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే రసాయన మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. 


జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో కొత్తిమీర అద్భుతంగా ప‌నిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. సన్నగా మెరుపుతీగలా అవ్వాలనుకునే వారికి కొత్తిమీర మంచి ఆప్షన్. దీనికి కొవ్వుని కరిగించే లక్షణాలు ఎక్కువ.  పెదవులు నల్లగా ఉన్నవారు రోజూ రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులపై రాస్తే మంచి రంగు సంత‌రించుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: