దాల్చిన చెక్క భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది విశాలమైన చెట్ల కొమ్మల బెరడు నుండి లభ్యం అవుతుంది. దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ.. దాల్చిన చెక్కను వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.  దాల్చిన చెక్క.. ఇది పురాతన కాలం నుండి వాడుతున్న మసాలా రకమని అందరికీ తెలిసిందే.


అయితే దాల్చిన చెక్క‌కు గుండె జ‌బ్బుల‌కు లింకేంటంటే.. దాల్చిన చెక్క- నీరు మిశ్రమం యాంటీ-ఆక్సిడెంట్’లను కలిగి ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆపుతుంది.  దాల్చిన చెక్క గుండెకి సంబంధించిన వ్యాధులు లేదా డయాబెటిస్ రావటంలో 23 శాతాన్ని తగ్గిస్తుందని ఓ ఆధ్యాయ‌నంలో తేలింది. అదే విధంగా దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 


అలాగే దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల, కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. మెదడుకు సంబంధించిన పలు వ్యాధులకు దాల్చిన చెక్క మంచి ఔషధంలాగా పని చేస్తుంది. మతిమరుపు, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల నివారణకు ఇది బాగా పని చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: