డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఫుడ్ తినడం  బోరింగ్‌గా ఉందా?  అయితే గాలిలో తేలుతున్న డైనింగ్ టేబుల్ దగ్గర ఆహారం తినొచ్చు. ఇప్పటి వరకు మల్టీ కుసిన్ రెస్టారెంట్లు, రోబో రెస్టారెంట్లు చూశాం. కానీ ఇప్పుడు గాల్లో తేలే రెస్టారెంట్ వచ్చేసింది.  అదే క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్. ఒకప్పుడు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ రెస్టారెంట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. భూమికి 160 అడుగుల ఎత్తులో ఈ ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఏర్పాటైంది. 


ఇదేదో వింతగా అనిపించినా ఈ అనుభూతిని మీ సొంతం చేసుకోవడానికి మన సిటీకే వచ్చేసింది క్లౌడ్ రెస్టారెంట్. ఇకపై హైదరాబాద్ నగర వాసులు ఊగుతూ తూగుతూ ఆహారాన్ని లాగించేయవచ్చు. గతంలో  బెంగళూరు, నోయిడాలో ఉన్న హ్యాంగింగ్ రెస్టారెంట్ ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ పేరు క్లౌడ్ డైనింగ్. 


ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ తినాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన బ్రాంచీలు ఢిల్లీ, బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఈ రెస్టారెంట్‌లో క్రేన్ సాయంతో ఒక్కో డైనింగ్ టేబుల్‌ను 160 మీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్తారు.గాలిలో విహరిస్తూ పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ మరో వైపు మ్యూజిక్ వింటూ సిటీ వ్యూ చూస్తూ తింటూ ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. ఈ డైనింగ్ టేబుల్ వద్ద ఒకేసారి 24 మంది ఒక్కో ఫ్లైయింగ్ కు కూర్చోవచ్చు. రెస్టారెంట్‌కు చెందిన నలుగురు సిబ్బంది ఆహారాన్ని వడ్డిస్తూ కస్టమర్స్ ని ఆనందింపజేస్తారు. 


హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ కు బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. మాక్ టైల్ సెషన్ కు అయితే ఒక్కో వ్యక్తికి 4999 రూపాయలు ఛార్జ్ చేస్తారు.  30 నిమిషాలు సమయంలో డిన్నర్ చేస్తూ సిటీ అందాలను ఆస్వాదించొచ్చు. డిన్నర్ తో పాటు పలు అడ్వెంచర్స్, మ్యూజిక్ సిస్టం ఉంటాయి. మాక్ టైల్ అంటే నాన్ అల్కహాల్ డ్రింక్స్ అయిన ఫ్రూట్ జ్యూస్స్ , కూల్ డ్రింక్స్ తోపాటు స్నాక్స్ కూడా అందిస్తామని తెలిపారు నిర్వహకులు. సౌత్, నార్త్ కు చెందిన 49 రకాల డిసెస్ ప్రత్యేక చెఫ్ లతో తయారుచేస్తామన్నారు. ఇండియాలో తమ బ్రాంచ్ హైదరాబాద్ లో రెండవదని చెబుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందినవాళ్లు హైదరాబాద్ లో ఉంటారు. ప్రత్యేక అనుభూతి కోరుకునే వారి కోసం క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: