నేడు హస్తినలో ఇండియా టుడే ఆద్వర్యంలో జరిగిన 'సాహిత్య ఆజ్-తక్ 2019' రెండవ రోజు కార్యక్రమానికి శృంగార సాహిత్య రచయిత్రులు అమృతా నారాయణ్ మరియు మాధురీ బెనర్జీ  "ఎరోటికా మరియు పోర్నోగ్రఫీ ప్రాధమిక వ్యత్యాసం" అనే విషయంపై మాట్లాడారు. 


వారిద్దరూ వారి వారి శృంగార సాహిత్య రచనలపై అక్కడ చర్చించారు. "రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా" రచయిత అమృతా నారాయణ్ కాగా, ఆమె “భారతీయ చరిత్రలో శృంగారం” పై పరిశోధనలు చేశారు.     
Image result for amrita narayan author parrots of desire
మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకే విధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్‌ అభిప్రాయపడ్డారు. ఆమె వృత్తిపరంగా క్లినికల్‌ సైకాలజిస్ట్‌, అలాగే కొన్ని గుర్తుంచుకోవలసిన శృంగార సాహిత్యానికి చెందిన పుస్తకాల కూడా రచించారు 


ఈ రెండింటికీ చాలా తేడా ఉందని, శృంగారం ఆత్మాశ్రయమని ఇద్దరి మనసుల నుండి పొంగిపొరలే భావోద్వేగం ద్వారా ఇరుమనసుల్లో ఒకరిపట్ల ఒకరికి  ఆపేక్ష, ఇష్టం, ఆప్యాయత, ఆదరణ, అనురాగం, ఆత్మీయత కలబోసిన భావోద్వేగాలు కల ఒక అమోఘ ప్రేమ భావన ఉంటుందని వెల్లడించారు. 


సాధారణ భావద్వేగాల నుండి జనించే ఎరోటిజం (భావొద్వేగ భరిత  శృంగారం) శృంగారం అనబడుతుంది. అదే శృంగారాన్ని ఒక వాణిజ్య పరిశ్రమగా మారిస్తే అది పోర్నొగ్రఫీ (అశ్లీల శృంగారం) అవుతుంది. అంటే ఎరోటికా అనేది సృజనాత్మకతకు వ్యక్తి లేదా వ్యక్తుల మానసిక ఆనందానికి సూచిక అయితే అది జీవితాంతం స్మృతులు మిగిల్చి సానుకూల ప్రభావం కలిగిస్తుంది.  పోర్నోగ్రఫి అనేది ప్రేక్షకులను తాత్కాలిక ప్రేరణ కలిగించే అంశం దాని ప్రభావం ప్రతికూలత కలిగిస్తుంది.    


పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని అమృతా నారాయణ్ వివరించారు. “రైటింగ్‌ ఎరోటికా ఇన్‌ ఇండియా” అనే అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు.


ఆధునిక భారత పాఠకులు వారి శృంగార ప్రయాణానికి సాహచర్యం అవసరమని - కోరికలనేవి మనం ఏకాంతంగా ఉన్నప్పుడు బయటపడేవి మాత్రమే. కాని సాంప్రదాయ వాదం మనల్ని మనకు వ్యతిరేఖం చేస్తుంది కాబట్టి పుస్తకాలతో మనం మనలా అనుభూతి పొందవచ్చు అని అన్నారు. రచనల్లో మనల్ని మనం చదవచ్చని అనుభూతి చెందవచ్చని ఆ ఉద్దేశంతో తాను రచనలు చేయటం మొదలెట్టానని అన్నారు అమృతా నారాయణన్  
 

“కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగా నిలబడాలని స్వాతంత్ర్యం వచ్చాక భారత్ గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్‌, లైంగికత రెండూ ఒక పడవలో ప్రయాణించలేవని ఒకదానికొకటి పొసగని అంశాలని గుర్తించాము. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ లైంగికత అనే అంశాన్ని అందుకే మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరికులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా అలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని అభివృద్ధిపధం లో నడిపించటానికి ఈ ఇమేజ్‌ లేదా ప్రతీక అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంత మాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయ పడతాయి” అని అమృత వివరించారు. క్లినికల్‌ సైకాలజిస్ట్‌ అయిన ఆమె ‘పారెట్స్‌ ఆఫ్‌ డిజైర్‌, ఏ ప్లెజెంట్‌ కెండ్‌ ఆఫ్‌ హెవీ’ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు.
Image result for amrita narayan & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MADHURI' target='_blank' title='madhuri -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>madhuri </a>banerjee
బాలీవుడ్ స్చ్రీన్ రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పాఠకులకు కొంత పరిచయం ఉన్న మాధురి బెనర్జీ,  మాట్లాడుతూ ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ వంటి పుస్తకాలకు సైతం పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. మాధురి బెనర్జీ, “లాసింగ్‌ మై వర్జినిటీ, గాళ్స్‌ నైటవుట్‌, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్‌, అడ్వాంటేజ్‌ లవ్‌, ఫర్‌బిడెన్‌ డిజైర్స్‌” వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్‌ ఉండవని చెప్పారు. 


శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని మాధురి బెనర్జీని ప్రశ్నించగా - ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో లైంగికత (సెక్సువాలిటీ) గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010 లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యా వ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు అంతర్జాలాన్ని (ఇంటర్నెట్‌) ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాలి’ అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: