పోర్న్‌కు బానిస అయితే ఏం జ‌రుగుతుందంటే..ప్రస్తుతం ప్రపంచాన్ని నెట్ విప్లవం శాసిస్తోంది. కారుచౌకగా స్మార్ట్ ఫోన్ల రూపంలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేయడంతో ఆ ప్రభావం ప్రతి ఒక్కరిపై తీవ్రంగా ఉంటుంది. ఇంటర్నెట్‌ను మంచికి వాడుకుని అభివృద్ధి చెందే వాళ్ళు ఉన్నారు. అదే ఇంటర్నెట్ తో ప్రమాదకర అంశాలకు బానిస అయ్యి పతనమై పోతున్న వారు ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ప్రభావంతో చాలామంది పోర్న్‌కు బానిసలు అవుతున్నారు. యుక్తవయసులో ఉన్నవారు హార్మోన్ల ప్రభావంతో పోర్న్‌కు బానిస అయ్యారు అంటే ఏదో అర్థం ఉంటుంది.... ఏకంగా 60 - 70 సంవత్సరాలు వచ్చినా వృద్ధులు సైతం దీనికి బానిసలుగా మారి పదే పదే ఆ వీడియోలు చూస్తూ ఇతర అంశాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు.

యవ్వనంలోకి అడుగు పెట్టగానే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. ఆ వయసులో ఎక్కడా లేని ఉత్సాహంతో పాటు కొత్త కోరికలు ఆలోచనలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే శృంగారానికి సంబంధించిన అంశాలపై సహజంగానే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. పురుషులు, మహిళల పట్ల ఆకర్షితులు అయితే.... మహిళలు, పురుషుల పట్ల ఆకర్షితులు కావడం జరుగుతుంది. అయితే భారతదేశ ఆచార సంప్రదాయాల నేపథ్యంలో శృంగారం గురించి ఓపెన్‌గా చర్చించుకునే అవకాశం లేదు. దీంతో యుక్త వ‌య‌స్కుఉలు నుంచి అంద‌రూ ఇంటర్నెట్ ప్రభావంతో చాలా రహస్యంగా పోర్న్ వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇవి ఒకసారి చూడటం అలవాటు పడితే అప్పటినుంచి అది వ్యసనంగా మారిపోతోంది. ముఖ్యంగా పోర్న్‌ వీడియోలలో నటించే వారి ప్రైవేట్‌ భాగాలు యువత మనసులో ప్రత్యేకంగా ముద్రపడిపోతాయి.తమకు కాబోయే భాగస్వామి ప్రైవేట్‌ భాగాలు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. పోర్న్‌ వీడియోలలో నటించే వారు అందుకోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డారన్న విషయాన్ని గుర్తించరు. ఇదే ఆ తర్వాతి రోజుల్లో పోర్న్‌కు బానిసైన వారి శృంగార జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో 12 - 15 సంవత్సరాల వయసులో ఉన్నవారు సైతం ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఆ వయసులో మెదడు వేగంగా స్పందిస్తుంది.

ఈ నేపథ్యంలో సెక్స్ కోరిక‌లు ఎక్కువగా ఉండటం వల్ల దానికి సంబంధించిన అంశాలు మెదడు బలంగా నాటుకుపోయి... ప్రతి ఒక్కరు శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి తో రగిలి పోతూ ఉంటారు. దీనివల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు పునాదిగా ఉన్న ఆ వయసులో సెక్స్‌కు బానిస అయితే ఇక వాళ్ళ జీవితం అక్కడితో దారి తప్పుతుంది. ఇక మధ్య వయస్కులు కూడా ఎక్కువగా చూడటం వల్ల వాళ్లు వాళ్ల‌ జీవితంలో సరిగా శృంగారంలో పాల్గొనలేరు. ఈ వీడియోలు ఎక్కువుగా చూడ‌డంతో స‌హ‌జంగానే శృంగారంపై ఆస‌క్తి త‌గ్గుతుంది. ఇక నుంచైనా పోరుకు చాలా దూరంగా ఉండ‌డ‌మో లేదా ప‌రిమితంగా చూడ‌డ‌మో చేస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: