సాధార‌ణంగా వేకువజామునే నిద్రలేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటామని అందిరికీ తెలిసిన విషయమే. కానీ అలా నిద్ర లేవడం అంటే చాలా కష్టమైన పనిగా భావిస్తారు చాలామంది. వాస్త‌వానికి రాత్రంతా మంచి నిద్రపోయినా పొద్దున్నే నిద్రలేవడం కష్టమైన పనే. బద్ధకం వస్తుంది. అలా బద్ధకంతో లేచి హడావిడిగా పనులు మొదలుపెడితే రోజంతా చిరాగ్గానే గడుస్తుంది. . నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి సమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటాం కానీ, ఉదయం మాత్రం లేవలేం బాబూ అనేవారూ లేక పోలేదు.


ఉదయం ఆహ్లాదంగా, రోజంతా సంతోషంగా గడవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్ర‌లేవాల‌న్నా.. రోజంతా ఆనందంగా ఉండాల‌న్నా రాత్రి త్వరగా నిద్రపోవాలనేది కాదనలేని నిబంధన. ఎన్ని పనులున్నా, అసలు నిద్ర వచ్చే మూడ్‌ లేకున్నా కనీసం పది నుంచి పదకొండు గంటల లోపు బెడ్‌పై చేరాలి. కంటి నిండా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల అల‌స‌త్వం ఉండ‌దు. నిద్ర లేవగానే, మంచం మీదనే, కాలు కూడా కింద పెట్టకుండా శరీరం అంతా లాగి స్ట్రెచ్ చేయాలి. 


దాని వ‌ల్ల‌ మన ఆలోచనలు, భావావేశాలు ప్రభావితం అవుతాయట. అలానే కుడికాలు ముందుగా కింద పెట్టి మంచం మీద నుంచి లేవాలి. ఆ ఒక్కరోజే కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి దోహదపడుతుందట. నిద్ర మత్తు వదలాలంటే.. వెంటనే సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల.. నిద్రమత్తు వదిలి.. శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: