ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ కావొద్దని వైద్య నిపుణులు గ‌ట్టిగా చేబుతున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి, లంచ్ ప్రిన్స్ లా తినాలి మరియు డిన్నర్ బెగ్గర్ లా తినాలనే నానుడి బాగా పాపులరైనది. వాస్త‌వానికి ఇది అక్షరాల సత్యం. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ ఎందుకు ముఖ్యమైనది అనడానికి క్లూ దాని పేరులోనే ఉంది. మనం రాత్రంతా ఖాళీ కడుపుతో ఉండి, ఉదయపు అల్పాహారంతో దానికి బ్రేక్ వేస్తాం. అయితే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ కూడా క‌డుపు నిండా తినాలి.


ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలనే అవగాహన నేడు అందరిలో వచ్చినా.. రాత్రి పూట తక్కువ, ఉదయం ఎక్కువ కెలోరీలు తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుందన్నది అంద‌రూ తెలుసుకోవాలి. ఈ రకమైన ఆహార అలవాటు వల్ల ఒబెసిటీ దరిచేరదు. హృదయ సంబంధ అనారోగ్యాలు, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలు తేలాయి. బరువు తగ్గడానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల మరింత ప్రమాధం ఉంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా, మరింత బరువు పెరిగే అవకాలున్నాయి.


అలాగే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేవారి ధమనుల్లో కొవ్వు చేరి మూసుకుపోతాయని ఓ ఆధ్యాయ‌నంలో తేలింది. అయితే ఉదయపు ఆహారం భారీగా తీసుకునేవారిలో ఈ ముప్పు ఉండదని కూడా తేలింది. అదే విధంగా.. ఉదయం తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్ సుగర్ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా వుండాలన్నది నిర్ణయిస్తుందట. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్క్ చేయకుండా తీసుకోవాలి. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రెష్ గా మరియు ఎనర్జీని అందించే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: