కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్‌- అరకిలో
మిరియాలు- టీస్పూను
జీలకర్ర- పావుటీస్పూను
నిమ్మరసం- అరటీస్పూను


కొత్తిమీర- కొద్దిగా
ఉల్లిపాయ- ఒకటి
టొమాటో- ఒకటి
కారం- అరటీస్పూను


పసుపు- చిటికెడు
గరంమసాలా- చిటికెడు
నూనె- టేబుల్‌స్పూను
ఆవాలు- పావుటీస్పూను
ఉప్పు- రుచికి సరిపడా


అల్లంవెల్లుల్లి- టీస్పూను
వెల్లుల్లి- 4 రెబ్బలు
పచ్చిమిర్చి- ఒకటి
దనియాలపొడి- టీస్పూను


త‌యారీ విధానం:
ముందుగా మష్రూమ్స్ ను శుభ్రం చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. త‌ర్వాత‌ వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా నూరి ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక కోసిన పుట్టగొడుగుల ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి.


అవి ఉడికిన తరవాత పసుపు, కారం, దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరవాత మూత తీసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ ఉడికించాక మిరియాల మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర తురుము చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే మష్రూమ్‌ మసాలా క‌ర్రీ రెడీ.. రైస్‌తో దీని కాంబినేష‌న్ చాలా టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!


మరింత సమాచారం తెలుసుకోండి: