సాధార‌ణంగా బొప్పాయి పండ్లతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బొప్పాయిని “ఫ్రుట్స్ అఫ్ ఏంజెల్స్” అని అంటారు. పూర్వ కాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తునారు. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, అందులో ఉండే విత్తనాలు కూడా మనకు ప్రయోజనకరమే. నిత్యం ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తింటే అనేక ఆరోగ్య‌క‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.


చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు. నిజానికి బొప్పాయి పండ్ల‌ను తిన్నాక చాలా మంది విత్త‌నాల‌ను పారేస్తారు కానీ విత్త‌నాల‌ను కూడా తిన‌వ‌చ్చు. ప‌ర‌గ‌డుపునే రెండు స్పూన్ల బొప్పాయి విత్త‌నాల‌ను రోజూ తింటుంటే మ‌ధుమేహం, హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది. అలాగే బొప్పాయి సీడ్స్ లో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది, దాంతో ఫెర్టిలిటి మెరుగుపరుస్తుంది.


శరీర బరువును త‌గ్గించ‌డంలో బొప్పాయి విత్త‌నాల‌ను ఎంతో ప‌నిచేస్తాయి. బొప్పాయి విత్తనాలు మరియు తేనెలో క‌లిపి తీసుకుంటే.. ఇందులో ఉండే కొన్ని రకాల హెల్తీ లిపిడ్స్, మరియు పొటాషియం కాంబినేషన్స్ శరీరంలో మెటబాలిక్ రేటును పెంచుతుంది, దాంతో బరువు తగ్గడం సులభమవుతుంది. అదే విధంగా బొప్పాయి గింజ‌లు వ‌ల్ల కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: