రైల్వేశాఖ తొలిసారి దక్షిణ మధ్య రైల్వేకు ‘భారత్‌ దర్శన్‌’ అనే పర్యాటక రైలును కేటాయించింది. దేశంలో ఉన్న పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలుగా ‘భారత్‌ దర్శన్‌’ అనే రైలును అందుబాటులోకి తెచ్చామని రైల్వే శాఖ స్పష్టంచేసింది. దీంతో  పర్యాటకులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని పలువురు పర్యాటకులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీల రూపకల్పన, నిర్వహణను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పర్యవేక్షిస్తుంది. 
పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా, దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పర్యటనలను ఏర్పాటు చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిఫ్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య తెలిపారు. మొదట దక్షిణ భారత యాత్రకు శ్రీకారం చుట్టామని, దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ పర్యాటక రైలు పయనిస్తుందని చెప్పారు.
ఉత్తర, దక్షిణ భారత యాత్రలకు సంవత్సరంలో 50వేలకు పైగా పర్యాటకులు పర్యటనకు  వెళ్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు మారాల్సి వచ్చి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి, నగర పర్యాటకుల డిమాండ్ ల మేరకు ప్రత్యేక రైలును ప్రారంభించనుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైల్వే సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేట్‌ టూరిస్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ ప్రైవేట్ సంస్థల ప్యాకేజీలు ఖరీదైనవని, కొన్ని సార్లు మోసాలు జరుగుతున్నాయని తెలిపారు పర్యాటకులు. దక్షిణ మధ్య రైల్వేకు సొంతంగా పర్యాటక రైలు రావడంతో ఇక ఇబ్బందులు తొలగినట్లేనని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. జనవరి 3 తెల్లవారుజామున సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరి పర్యాటక స్థలాలను తిరిగి 
జనవరి 10న మధ్యాహ్నం తిరిగి సికింద్రాబాద్‌ చేరుతుందని తెలిపారు.
సందర్శించే స్థలాలు: 
సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా మొదట శ్రీరంగం చేరుతుంది. శ్రీరంగనాథ స్వామి ఆలయ సందర్శన.. తంజావూర్‌ బృహదీశ్వరాలయ పర్యటన.. అక్కడి నుంచి 2,500 ఏళ్ల నాటి పురాతన పట్టణమైన మధుర meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి ఆలయ సందర్శన.. ఇంకా రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, కన్యాకుమారిలోని కుమారి అమ్మన్‌ దేవాలయం, వివేకానందరాక్‌ మెమోరియల్‌ ఆలయ సందర్శనాల అనంతరం మహాబలిపురం చేరుతుంది.
అనంతరం కాంచీపురం చేరుకొని అక్కడి నుంచి మరలి.. జనవరి 10వ తేదీ మధ్యాహ్నానికి సికింద్రాబాద్‌ చేరుతుంది.
‘భారత్‌ దర్శన్‌’ సమాచారం కొరకు పర్యాటకులు సికింద్రాబాద్‌ ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని (82879 32227), (82879 32228) తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: