బిగ్  బాస్ వ్యాఖ్యాత గా వ్యవహరించిన నాగార్జున భారీగానే పారితోషికం తీసుకున్నాడు . అయితే గతం లో బిగ్ బాస్ ను హోస్ట్ వ్యవహరించిన  ఎన్టీఆర్ , నాని లతో పోలిస్తే టాలీవుడ్ మన్మథుడు తీసుకున్న పారితోషికం తక్కువేనని తెలుస్తోంది . బిగ్ బాస్ సీజన్ -1 కు వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడన్న ప్రచారం అప్పట్లో జరిగింది .


ఇక బిగ్ బాస్ సీజన్ -2 హోస్ట్ గా నేచురల్ స్టార్ నాని వ్యవహరించాడు . నానికి కూడా స్టార్ మా ఏకంగా ఏడుకోట్ల రూపాయలను ముట్టచెప్పినట్లు తెలుస్తోంది . బిగ్ బాస్ సీజన్ - 3  వ్యాఖ్యాతగా నాగార్జున ను ఎంపిక చేసుకున్న స్టార్ మా , గత రెండు సీజన్ల లో హోస్ట్ గా వ్యవహరించిన వారి  కంటే ఈ సీనియర్ హీరో కు తక్కువ రెమ్యునేషన్ ముట్టచెప్పడం హాట్ టాఫిక్ గా మారింది . బిగ్ బాస్ సీజన్ -3  కోసం నాగార్జున సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు . అయినా కూడా నాగ్ కు దక్కింది మాత్రం ఐదు కోట్ల రూపాయల పారితోషికమేనని తెలుస్తోంది .


బిగ్ బాస్ సీజన్ -3 టీఆర్పీ రేటింగ్ , తొలుత బాగానే ఉన్నప్పటికీ , షో సాగుతున్న కొద్దీ తగ్గినట్లు తెలుస్తోంది . హోస్ట్ గా నాగార్జున షో ప్రారంభం లో బాగానే ఆకట్టుకున్నప్పటికీ , చివరకు వచ్చేసరికి దర్శకులు చెప్పినట్లు చేసి వెళ్లాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు . ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో అందరికంటే శ్రీముఖి అత్యధిక పారితోషికాన్ని దక్కుంచుకోగా, విజేత గా నిలిచిన రాహుల్  కు 40 లక్షలు దక్కినట్లు  సమాచారం .


మరింత సమాచారం తెలుసుకోండి: