ఈ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో మంచి నిద్రకు  ప్రతి మనిషి దూరమవుతున్నాడు. పొద్దంతా అలసినపోయిన వారు గంటల తరబడి మంచంపై పడుకున్నప్పటికీ ప్రశాంతమైన నిద్ర పట్టక ఎంతగానో అశాంతికి గురవుతున్నాడు. అయితే పడుకోగానే మంచి నిద్రపట్టేందుకు అమెరికాకు చెందిన సైనికులు వినూత్న విధానాన్ని కనుగొన్నారు. కేవలం 120 సెకెన్లలో దీని ద్వారా నిద్ర పడుతుందని వెల్లడయ్యింది.


అయితే ఇందుకోసం కొద్దిపాటి ప్రాక్టీస్ చేయాల్సి వుంటుందని తెలిపారు.. ఇక అమెరికా ఫైటర్ పైలెట్లు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొనేవారట. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెరికా నేవీ- ప్రీ పైలెట్ స్కూల్ త్వరగా నిద్ర పట్టేందుకు ఒక శాస్త్రీయ విధానాన్ని కనుగొంది. ఇకపోతే ఈ విధానం అనుసరించడం ద్వారా ఎప్పుడైనా సరే సులభంగా నిద్రపోవచ్చని  ‘రిలాక్స్ అండ్ విన్ చాంపియన్ షిప్ పర్ఫార్మెన్స్’ పేరుతో ఉన్న పుస్తకంలో దీనికి సంబంధించిన వివరాలను వివరించారు.


ఈ టెక్నిక్‌ను వరుసగా ఆరు వారాల పాటు ప్రాక్టీస్ చేసిన 96 శాతం పైలెట్లు దీని ద్వారా లబ్ధి పొందారట. ముందుగా కుర్చీలో కూర్చుని నిద్రపోయే టెక్నిక్‌ను ఈ విధానంలో పైలెట్లకు  నేర్పించారట. ఇందుకు గాను కుర్చీపై నిద్రించే వ్యక్తి నడుమును నిటారుగా ఉంచి, పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. చేతులను తొడలపై స్వేచ్ఛగా వదిలివేయాలి. ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్న అనంతరం కళ్లు మూసుకుని, దృష్టినంతా ముఖంపై నిలపాలి.


శ్వాసను మెల్ల మెల్లగా తీసుకుంటుండాలి. శ్వాసను వదులుతున్నప్పుడు శరీరంలోని ప్రతీ అవయవం తేలికపడుతున్న భావనను పెంపొందించుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరానికి రిలాక్స్ అవుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా చేయడం వలన త్వరగా నిద్రపడుతుందని ‘రిలాక్స్ అండ్ విన్  చాంపియన్ షిప్ పర్ఫార్మెన్స్’ పుస్తకంలో రాసివుంది. ఇకపోతే ఈ విధానాన్ని మంచం మీద కూడా ప్రాక్టీస్ చేయవచ్చునని వెల్లడించారు...


మరింత సమాచారం తెలుసుకోండి: