గోవా బ్యూటీ ఇలియానా అంతా టైమ్ పాస్ కోసమే అంటోంది. లవ్ అండ్ రిలేషన్ లో అసలు హానెస్ట్ అనేదే లేదంటోంది. జస్ట్ క్రేజీ కోసమే డేటింగ్ చేశానంటోంది. అంతేకాదు తాను లవ్ ను ఏనాడు సీరియస్ గా తీసుకోలేదనీ అసలు సీక్రెట్ ఓపెన్ చేసింది. 


గోవా బ్యూటీ ఇలియానా లవ్ బ్రేకప్ ఆల్వేస్ హాట్ టాపిక్. విదేశీ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం సాగించి సహజీవనం చేసి బ్రేకప్ చెప్పిన సంగతిని ఈ బ్యూటీ జీర్ణించుకోలేకపోతోంది. అయితే ఇలా అకస్మాత్తుగా లవ్ బ్రేకప్ కు కారణమేంటి? ఇన్నాళ్లూ ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియన్స్ కు గోవా బ్యూటీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. అందరూ నోళ్లు వెళ్లబెట్టుకునేలా  చేసింది.


ఇలియానా తాజాగా పాగల్ పాంటీ సినిమా ప్రమోషన్స్ లో లవ్ బ్రేకప్ కు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎప్పుడూ రియల్ డేట్ లో లేనంటూ చెప్పి ఇల్లీబేబీ పెద్ద షాకిచ్చింది. ఏదో ఫన్ కోసం క్రేజీ కోసం రెస్టారెంట్ కు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ తో టైమ్ పాస్ చేసేదాన్నంటోంది. అంతేకాదు తన డేటింగ్ లో హాయ్, బై, పికప్ డ్రాపింగ్ లు తప్పా అంతకు మించి ఏం లేదని ఆడియన్స్ చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. 


ఇలియానా కామెంట్స్ ప్రస్తతం వైరల్ అవుతున్నాయి. ఫన్ కోసం లవ్ చేసుకోవడం ఎందుకు.. కెరీర్ పాడు చేసుకోవడం ఎందుకని నెటిజన్లు ఇల్లీబేబీని రౌండప్ చేస్తున్నారు. నాలుగేళ్లు ఆ బీచ్ ఈ దేశం అంటూ తిరింగిందంతా ఒట్టిదేనా.. జస్ట్ ఫన్ కోసమేనా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బ్రేకప్ తర్వాత ఇలియానా బాగా ముదిరిపోయింది. ప్రియుడు ఆండ్రూని హార్ట్ నుండి డిలీట్ చేసినంత ఈజీగా తను డేటింగ్ చేసిన విషయాన్ని ఆడియన్స్ మైండ్ నుండి తీసేయాలని ఇల్లీబేబి బాగానే ఆరాటపడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: