కావాల్సిన ప‌దార్థాలు:
జీడిపప్పు- 125 గ్రా
మైదా- రెండు కప్పులు
బాదం పొడి- పావుకప్పు


బేకింగ్‌ సోడా- అర చెంచా
పాలు- మూడు చెంచాలు
పంచదార పొడి- కప్పున్నర


వెన్న- వంద గ్రా
సోడా-నాలుగు చుక్కలు
ఉప్పు- చిటికెడు


తయారీ విధానం:
ముందుగా జీడిపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి. అందులో మైదా బాదంపొడి, బేకింగ్‌ సోడా, పంచదార పొడి, వెన్న, వేసి బాగా కలపాలి. గట్టిగా అయితే పాలు పోసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని నచ్చిన ఆకారాల్లో కట్‌ చేసుకోవాలి.


తర్వాత ఓవెన్‌ ట్రేలో పెట్టి ఇరవై ఐదు నిమిషాలు బేక్‌ చేయాలి. అంతే రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం జీడిప‌ప్పు బిస్కె‌ట్లు రెడీ.. అయితే గాలి చొరపడని డబ్బాలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. జీడిప‌ప్పు లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.
వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంది.


నిజానికి మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్‌ జీడిపప్పులో ఉంటుంది.  ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: