రోజు వైన్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది.. లివర్ చెడిపోతుంది అని వైద్యులు.. మన పెద్దలు చెప్తుంటారు. కానీ తాజా పరిశోధనల్లో ఆ వైన్ ఎన్నో రోగాల నుండి రక్షిస్తుందని చెబుతుంది.. అంతే కాదు రోజు ఆ వైన్ తాగటం వల్ల వృద్ధాప్యం కూడా అంత త్వరగా దగ్గరకు రాదట. అయితే.. ఏ వైన్ పడితే ఆ వైన్ తాగడం వల్ల ఆ లాభాలు పొందారట.


కేవలం బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. ఈ వైన్ లలో కార్బనెట్ ఎక్కువగా ఉంటుంది అని అది శరీరానికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. రెడ్ వైన్, వైట్ వైన్ కూడా మంచివేనట కానీ మంచిదని ఎక్కువగా తీసుకోకూడదు.. రోజూ రాత్రి తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


రెడ్ వైన్‌లో ఉండే ఆమ్లజనకాలు గుండె సంబంధిత వ్యాధుల రాకుండా చూసుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వైన్‌ను ఒక మోతాదులో రోజూ తీసుకుంటే ఎక్కువ కాలం జీవించగలుగుతారట. ఆ వైన్ ఆయుష్షును పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా వైన్ తాగటం వల్ల యవ్వనంగా, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుందని పరిశోధకులు చెప్తున్నారు. 


కాగా వైన్ లో ఉండే ప్లేవానాయిడ్స్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతాయట. అయితే హై బీపీ ఉన్నవాళ్లకూ వైన్ చాలా మంచిది. మధుమేహాన్ని కూడా ఈ వైన్ కంట్రోల్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వైన్ తగిన మోతాదులో తీసుకొని ఆరోగ్యంగా యవ్వనంగా ఉండండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: