కావాల్సిన ప‌దార్థాలు:
దోశపిండి- సరిపడా
ఉల్లిపాయలు- 4
ఎండు మిరపకాయలు- 6


జీలకర్ర- 1 స్పూను
చింతపండు- 10 గ్రా
చీజ్‌ తురుము- 100గ్రా


వెల్లుల్లి రెబ్బలు- 4
ఉప్పు- తగినంత
నూనె- 3స్పూన్లు
కొత్తిమీర- పావు కప్పు


తయారీ విధానం:
ముందుగా పెనంలో 3 స్పూన్లు నూనె వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని , వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి రెండు చుక్కలు నూనె వేసి అది పెనం మొత్తం అయ్యేలా చూడాలి. తర్వాత దోశ పిండి వేసి పెనం మొత్తం పరచాలి.


రెండు నిమిషాలు ఆగి తర్వాత రెండు చుక్కలు నూనె దోశ మీద, చుట్టూ వేసుకోవాలి. ఉల్లి కారం కూడా దోశ మీద రాయాలి. ఇప్పుడు చీజ్‌ తురుము వేసి కరిగే వరకు ఆగాలి. తరిగిన కొత్తిమీర వేసి దోశను మడిచి వేడి వేడి పల్లీ చట్నీతో గానీ కొబ్బరి చట్నీతో గానీ సర్వ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ కారం దోశ‌ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: