నేడు మార్కెట్లో ఎన్నో అందమైన మోడల్ కార్లు ఉన్నాయి. అయినా గాని రోజు రోజుకు కొత్త కొత్త మోడల్స్ కార్లు మార్కెట్స్ లోకి వసున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఏ కారు చూసిన కంటికి ఇంపుగానే కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో ఉన్న కార్లల్లో అందమైన కారు ఏదంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి కారు ఒక్కో విధంగా డిజైన్ చేసి చూడగానే ఆకట్టుకునేలా రూపొందించారు. అందుకే ఇది తక్కువని, అది బాగోలేదని చెప్పడం చాలా కష్టం. కాని ఈ విషయాన్ని ఓ సంస్ద తెలిపింది.


ఎలాగంటే కారు అందాన్ని లెక్కించేటందుకు ఉన్న ఒక ఫార్ములా పేరు ‘గోల్డెన్ రేషియో’. ఒక వస్తువు ఎంత అందంగా, పర్​ఫెక్ట్ గా ఉన్నదని తేల్చడానికి ఉపయోగించే విధానంలో ఈ రేషియో ఎంత బాగా ఉంటే ఆ వస్తువు అంత క్వాలిటీగా, అందంగా ఉన్నట్లని చెబుతారు. ఇకపోతే ఈ గోల్డెన్ రేషియోను లెక్కించడానికి   అల్జీబ్రాలో ఓ ఈక్వేషన్ కూడా ఉంది. దాన్ని బట్టి 2010 నుంచి ఇప్పటిదాకా మార్కెట్లోకి వచ్చిన 626  కార్ల మోడళ్లలో ఏది పర్​ఫెక్ట్‌‌గా ఉందో తేల్చాలని బ్రిటన్‌‌కు చెందిన ‘కార్ వావ్’ అనే కంపెనీ ఈ ఫార్ములాను ట్రై చేసింది. దీంతో అన్ని కార్ల కంటే.. ‘స్మార్ట్ ఫర్ టూ కాబ్రియో (2016)’ కారు పర్‌‌ఫెక్ట్ అందంతో ఉందని తేలింది.


జర్మనీకి చెందిన డైమ్లర్ ఏజీ కంపెనీ తయారు చేసిన ఈ కారు.. 98.83% గోల్డెన్ రేషియోతో టాప్ ప్లేస్‌‌లో నిలిచింది. దీని తర్వాత కార్లలో ఫోక్స్‌‌వ్యాగన్ అప్ (2011) 98.62%, వాక్స్ హల్ మోకా (2016) 98.57% గోల్డెన్ రేషియోతో రెండు, మూడో స్థానాల్లో నిలవగా. టొయోటా కరోలా (2019) 98.56%, నిస్సాన్ మైక్రా (2013) 98.55%తో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇక అన్ని కార్లలోకెల్లా ఫోర్డ్ ఫియెస్టా గోల్డెన్‌‌ రేషియో 34.31% మాత్రమే ఉన్నట్టు తేలింది.


మెర్సిడిస్ జీఎల్‌‌సీ 63 ఏఎంజీ కూప్, ఆడీ ER స్పోర్ట్ బ్యాక్ కార్లకు తక్కువ రేషియో వచ్చింది. ఇక శతాబ్దాల కిందట సైంటిస్టులు ఏదైనా ఒక వస్తువు లేదా మనిషి ఎంత అందంగా, పర్‌‌​ఫెక్ట్‌‌గా ఉన్నారో సైంటిఫిక్‌‌గా చెప్పేందుకే  గోల్డెన్ రేషియో టెస్టును కనుగొన్నారు.


ఇకపోతే క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుంచే ఈ క్వేషన్ ను ఎందరో ప్రముఖ ఆర్టిస్టులు, సైంటిస్టులు ఉపయోగించారట. ఈ ఫార్ములా ప్రకారం అత్యంత అందమైన మహిళగా మోడల్‌‌ బెల్లా హదీద్‌‌ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక వివిధ భాగాలు, వాటి మధ్య కోణాలు, దూరాన్ని బట్టి గోల్డెన్ రేషియోను అంచనా వేస్తారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వస్తువు అంత పర్‌‌ఫెక్ట్‌‌గా, అందంగా ఉన్నట్టు భావిస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: