మన భారత దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న భయపడే రోజులు వచ్చేసాయి. వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు.. దీంతో వారి వ్యాపారమే కాదు ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. డాక్టర్లకు కూడా ఈ ఆహార కల్తీ బాగా కలిసొస్తుంది అనే చెప్పాలి. 


ఇంకా విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం. ఆహారకల్తీ గురించి. ఎక్కువగా మాంసంలో కుళ్ళినవి పెడుతున్నారని, చికెన్ బిర్యానీ బదులు కుక్కలా బిర్యానీ పెడుతున్నారని ఇలా చాల వార్తలు చదువుతూనే ఉన్నాం. ఒక్క మాంసమే కాదు బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో ఆహార కల్తీ ఉంటుంది. అన్ని కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి. 


అసలు బయట ఆహారం తీసుకోవాలన్న, నీరు తాగాలన్న భయం వేసేలా వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు ఫుడ్ రెస్టారెంట్స్ పై ఆకస్మిక దాడులు జరిపిన సరే వారి వ్యాపారం వారిదే.. అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డేరింగ్ వచ్చాక కల్తీ ఆహారం మరి ఎక్కువ అయిపోయింది అనే చెప్పాలి. 


నిన్న కూడా నెల్లూరు నగరంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు రెస్టారెంట్ల పై ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేశారు. వారి వ్యాపారం కోసం మనుషుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు అని తెలిసిన మళ్ళి అదే బయట హోటల్స్ లో తినడానికి వెళ్తుంటారు. అందుకే ఇంట్లో అమ్మ చేసిన ఆహారమే ఎంతో రుచి అని చెప్పచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: