గడుస్తున్న కొద్దిరోజులుగా మన దేశంలో ఆహారకల్తీ అనేది రోజురోజుకు మరింత జఠిల సమస్యగా మారుతూ మన ప్రాణాలను మెల్లగా హరించి వేస్తోంది. త్రాగే నీరు, పీల్చే గాలి కల్తీతో ఇప్పటికే సతమతం అవుతున్న మనం, వాటితో పాటు తినే ఆహారంలో కల్తీ వలన అతి తక్కువ సమయంలోనే పలు రకాల వ్యాధుల బారిన పడుతూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ విధంగా చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడడం అనేది ఎక్కువగా ఎవరైతే బయట పదార్ధాలు తింటుంటారో అటువంటి వారికే జరుగుతోంది, దీనిని బట్టి బయట హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిల్లో కల్తీ ఏ విధంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అన్ని హోటళ్లు అలానే ఉంటున్నాయా అంటే, కాదు అనే చెప్పాలి. ప్రతి చోటా కూడా చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది, ఎంతో పరిశుభ్రంగా ఆహార పదార్ధాలను వండి, వడ్డించే హోటళ్లు కొన్ని ఉన్నప్పటికీ, 

నేటి కాలంలో ఆ విధంగా వినియోగదారుడి ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకుని పదార్ధాలు తాయారు చేసే హోటళ్లను వెతికిపట్టుకోవడం అంటే కొంత కష్టమే అని చెప్పాలి. ఇక ఎవరైతే ఎక్కువగా బయటి పదార్ధాలు తింటున్నారో, అటువంటి వారు వీలైనంత త్వరగా ఆ పనిని ఆపివేసి, ఎక్కువగా మన ఇంట్లో తయారు చేసినవి తింటే మేలని అంటున్నారు డాక్టర్లు. ఇక ఇటీవల తమ దగ్గరకు వస్తున్న కేసుల్లో ఎక్కువగా యువత ఉంటున్నారని, వారిలో లీవర్ మరియు కిడ్నీ సమస్యలు, ఆహారం అరగక పోవడం, ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతూ వస్తున్నారని చెప్తున్నారు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ విధమైన వ్యాధులతో సతమతం అవుతున్న వారిలో మెజారిటీ పేషంట్లు బయట జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటున్న వారే అధికులు ఉండడం అట. 

ఇది కేవలం మనదేశంలోని ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదండోయి, దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. కాబట్టి తల్లితండ్రులు కూడా అవకాశం ఉన్నంతవరకు తమ బిడ్డలకు ఆహారాన్ని ఇంట్లోనే వండి పెట్టెలా వీలు చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రకరకాల రంగులు, కెమికల్స్ వంటివి కలిపిన ఆహారపదార్ధాలు తినకుండా ఉంటె బెటర్ అని, అలానే వాటితో పాటు పండ్లు కూరగాయల వంటివి కూడా బాగా శుభ్రం చేసుకుంటే తీసుకుంటే మంచిదని, ఇటువంటి చిన్న పద్ధతులు పాటిస్తే మన ఆరోగ్యం భద్రంగా ఉంచుకుని, కొంతవరకైనా ఈ ఆహార కల్తీ నుండి తప్పించుకోవచ్చని అంటున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: