ఈ మధ్య కాలంలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయనిదే మరే పని చేయరు. వ్యాయామం కూడా వారి జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ కొన్ని సార్లు వివిధ కారణాల వలన జాగింగ్, వాకింగ్, యోగా చేయటం కుదరదు. అలా జాగింగ్, వాకింగ్, యోగా చేయలేకపోయినవారు ఒక చిట్కాను పాటిస్తే వ్యాయామం స్కిప్ చేసినా ఎటువంటి నష్టం జరగదని నిపుణులు చెబుతున్నారు. 
 
నిపుణులు తక్కువ సమయంలో పుషప్స్ చేయటం ద్వారా ఎక్కువ మేలు పొందవచ్చని చెబుతున్నారు. నిపుణులు శరీరానికి పూర్తి స్థాయి వ్యాయామం పుషప్స్ సరైన రీతిలో చేస్తే కలుగుతుందని చెబుతున్నారు. ఒక అధ్యయనంలో శరీరంలోని ప్రతి అవయవాన్ని తల నుండి పాదాల వరకు ప్రభావితం చేసే శక్తి పుషప్స్ కు ఉందని తేలింది. అందువలన నిపుణులు వ్యాయామానికి తగిన సమయం కేటాయించలేకపోతే రెండు నిమిషాలు పుషప్స్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. 
 
రోజుకు 120 సెకన్ల పాటు పుషప్స్ చేయటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని సమయం కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు రెండు నిమిషాల పాటు పుషప్స్ చేసే వారిని ప్రతిరోజు ఎక్కువ సమయం వ్యాయామం చేసేవారిని పరిశీలించగా రెండు ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. 
 
నిపుణులు స్త్రీలు 20 పుషప్స్, పురుషులు 40 పుషప్స్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.నిపుణులు ప్రతిరోజు పుషప్స్ చేసేవారికి మంచి శరీర సౌష్టవం ఏర్పడుతుందని నడుం కింద, కాళ్లు, చేతులలో కండరాలు ధృడంగా తయారవుతాయని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: