1. త్వరగా నిద్రపోకపోవడం
చాలామంది ఆఫీస్ నుంచి వచ్చి త్వరగా పడుకోకుండా టీవీలో సినిమాలు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వాళ్లు లేట్ నైట్ వీడియో గేమ్స్ అంటూ అర్ధరాత్రి 12 వరకు నిద్ర పోకుండా అలానే ఉంటారు. అలా లేటుగా నిద్రపోయే వారి మెదడు మొద్దుబారి పోయి రోజువారి పనుల్లో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. చాలా మతిమరుపు వస్తుంది. ఏకాగ్రత కోల్పోయి దేని మీద శ్రద్ధ పెట్టలేరు. అందుకే మీ మెదడు మంచిగా పని చేయడం కోసం సరైన టైంలో నిద్రపోండి అదేవిధంగా సరైన టైంలో లేవండి. 


2. ఎక్కువగా నిద్రపోకపోవడం
ప్రతిరోజు చాలా తక్కువగా నిద్రపోవడం వలన మీ మెదడు, మీ శరీరం చాలా వీక్ అవుతాయి. కానీ మీరు ఒక వారం రోజులు పాటు డైలీ 7-8 గంటలు మంచిగా పడుకుంటే.. మళ్లీ మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ శరీరంలో ఉత్సాహం వస్తుంది. 


3. రాత్రి సమయంలో భోజనం చాలా ఎక్కువ తినడం
పొద్దున పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం మంత్రి లాగా ఆలోచించుకొని తినాలి, రాత్రి వేళల్లో బంటు లాగా కొంచెం తినాలని చెబుతుంటారు. ఎంత తిన్నాం అన్నది ముఖ్యం కాదు ఏ టైంలో తిన్నాము అనేది ముఖ్యం. ఎందుకంటే మనం తినే సమయం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి నైట్ టైం లో మరీ ఎక్కువగా తింటే ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తినేటప్పుడు ఒక ముద్దని పది సార్లు నమిలి ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినాలి. అప్పుడే ఆహారం మీ వొంటికి పడుతుంది. 


4. వేయించిన ఆహారం/ఫ్రైడ్ ఫుడ్స్ తినడం 
మీరు రాత్రి వేళల్లో వేయించిన ఆహారం కానీ వేయించిన ఫ్రైడ్ చిప్స్ కానీ తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.


5. డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోవడం
నిద్రపోయే రెండు గంటల ముందే మీరు ఆహారాన్ని తీసుకోండి. పడుకునే ముందు 20 నుంచి 30 నిమిషాల వరకు నడవండి. అలా శారీరక శ్రమ కలిగించడం వల్ల మీ శరీరం అలసిపోయి మీకు త్వరగా నిద్రపడుతుంది. 


6. కారం గా ఉండేవి తినడం 
కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవి మీ కడుపు లో మంటని.. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందువల్ల మీకు నిద్ర సరిగా పట్టదు. కారంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీ మెటబాలిజం స్పీడ్ అవుతుంది కానీ రాత్రివేళల్లో అవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని జరుగుతుంది. 


7. తీపి పదార్థాలు తినడం
తీపి పదార్థాలను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ ఎక్కువగా తీపి తింటే అది మీ ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేస్తుంది. అరాత్రి వేళల్లో మీరు కొంచెం తీపి తిన్నాం మీకు అలసటని కలిగించి మీ శరీరంలోని ఉపయోగకరమైన విటమిన్స్ అన్నిటిని మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి. అందుకే రాత్రివేళల్లో తీపి పదార్థాలను తినడం మానుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: