సాధార‌ణంగా కొంతమంది పిల్లల్లో సహజంగా ఉండే చురుకుదనం గానీ, గ్రహణశక్తి గానీ, జ్ఞాపకశక్తిగానీ ఉండవు. అయితే, ఆ లక్షణాలన్నీ పిల్లలు తమకు తామే సృష్టించుకున్నవి అన్నట్లు, చాలామంది తల్లిదండ్రులు వాళ్లను అదేపనిగా తిడుతూ ఉంటారు. వాస్త‌వానికి చాలా మంది  చిన్నారులు  ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచి ఆ హడావుడిలో అల్పాహారం తీసుకోవటం మానేస్తుంటారు. అయితే సమస్య అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌ కీలకమైన ఆహారం.


అయితే పిల్లలు ఏం తినకుండా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిపోతే శరీరంలో గల శక్తి నిల్వల్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిల్వశక్తి స్ట్రెస్‌ హార్మోన్‌ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి పిల్లలు అలసటగా, విసుగ్గా, చిరాగ్గా మారిపోతుంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అవసరమైన పోషకాలు లోపించి పిల్లలు రక్తహీనతకు కూడా గురవుతారు. అలాగే ఆకలితో బడిబాట పట్టే పిల్లలు చదువుపై ధ్యాస పెట్టలేరు. ఇది వారి ఆలోచనా సామర్థ్యం, గ్రహణశక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే  బ్రేక్‌ ఫాస్ట్‌ చేయకుండా దాటేసే అవకాశాన్ని పిల్లలకు ఎంత మాత్రం ఇవ్వకూడదు.


నిజానికి, పెద్దల్లో అయినా, పిల్లల్లో అయినా మెదడు శక్తివంతంగా పనిచేయాలంటే రక్తంలో సరిపడా గ్లూకోజ్‌ ఉండాలి. అందుకు బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి. ఎందుకంటే ముందురోజు డిన్నర్‌ పూర్తి చేసి ఉంటే ఉదయం 8 అయ్యేసరికి 12 గంటలు పూర్తవుతుంది. అప్పటిక శరీరంలోని గ్లూకోజ్‌ అంతా హరించుకుపోతుంది. అందుకే తెల్లారేసరికి  మెదడు మొత్తం శరీరం గ్లూకోజ్‌ కోసం ఆవురావురుమన్నట్లుగా ఉంటాయి. ఆ దీర్థ వ్యవధి తర్వాత కూడా బ్రేక్‌ ఫాస్ట్‌ చేయకుండా ఉంటే మెదడు పూర్తిగా డీలాపడి పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: