చలికాలం వచ్చింది బాబోయ్... ఎంత కేర్ తీసుకున్న సరే.. ఎన్ని దుప్పట్లు కప్పుకున్న సరే.. ఎన్ని స్వేటర్లు వేసుకున్న సరే నిన్ను వదలను అన్నట్టు ఆ చలి అసలు వదలదు.. అంత చలి ఉంటుంది. అదికాక ఇప్పుడు చలి తీవ్రత చాల పెరిగింది. దీంతో ఉదయం లేవాలంటే మరి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ చలి తగ్గాలి అంటే కేవలం దుప్పట్లే కాదు.. తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. 

               

అయితే ఆ జాగ్రత్త చాల కాస్ట్లీ.. ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి. ఉల్లిపాయ. ఉల్లిపాయ ఇప్పుడు చాలా కాస్ట్లీ కదా.. కేజీ ఉల్లిపాయలు 100 రూపాయిలు అవుతుంది. అయితే ఈ కాస్టలీ ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని ప్రయాజనాలు ఉన్నాయో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని అంటుంటారు పెద్దలు. 

               

అయితే ఈ ఉల్లి గురించి తెలుసుకున్నాక అది నిజమే అనిపిస్తుంది. ఇంకా విషయానికి వస్తే.. మనం రోజు తీసుకునే ఆహారంలో ఉల్లిగడ్డను తీసుకోవడం ద్వారా ఎంతటి చలిలోనైనా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చవని పలువురు ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూరను వండరన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఉల్లిలో ఉండే ఎంజైమ్స్‌, కొన్ని యంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల మన శరీరాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుతుందట. 

               

అందుకే చలికాలంలో రోజుకు ఒక ఉల్లి తింటే ఎంత చలికి తటుకొనైనా ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లి కాస్ట్లీ అయినా ఉల్లిని కోనేయండి.. స్వటర్లు వదిలేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: