మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్‌ ఒక భాగమైపోయింది. మెలకువగా ఉంటే చేతిలో, నిద్రపోతే పక్కలో ఫోన్‌ ఉండాల్సిందే. దీంతోపాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాల వాడకమూ పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎక్కువవుతున్నకొద్దీ వచ్చే రోగాల సంఖ్య పెరగడంతో పాటు మనుషుల మధ్య సంబంధాలూ దెబ్బ తింటున్నాయన్నది నగసత్యం. మొబైల్ ఫోన్లను 5 గంటల కన్నా ఎక్కువ సమయం వాడితే వారికి ఊబకాయం మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో తేలింది.

 

స్మార్ట్ ఫోన్ వినియోగంతో దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒసిప్టల్ న్యూరాల్జియా. ఇదో నరాల సంబంధిత సమస్య. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు ఒత్తిడికి గురై వాచిపోవడం ఈ స్థితిలో జరుగుతుంది. దీంతో తలనొప్పి లేదా తీవ్రమైన తలనొప్పికి కారణమయ్యే మైగ్రేయిన్ ఎదురవుతుంది. అలాగే అధ్యయనం ప్రకారం రోజుకు ఐదు గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను వాడితే ప్రమాదమని, గుండె జబ్బులు, డయాబెటిస్‌ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

 

అలాగే  బ్రెయిన్ క్యాన్సర్,  పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గడం, ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు వస్తాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అంతేకాదు అవసరానికి మించి ఫోన్‌ వాడకం వల్ల నిద్రలేమి, అలసట, పనిలో నిస్సత్తువ వంటి అవలక్షణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌ ఉపయోగించే ఐదేళ్లలోపు చిన్నారుల్లో కంటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: