ఉద్యోగం చేసే చోట బాస్‌కి, ఎంప్లాయిస్‌కి మధ్య మంచి రిలేషన్స్ ఉంటే పని బాగా జరుగుతుంది. అయితే, అదే స‌ద‌రు ఉద్యోగి నేరుగా వెళ్ల‌కుండా చేసే ఉద్యోగాలు ...అంటే  వర్క్‌ ఫ్రమ్‌‌ హోం, ఫ్రీలాన్స్‌‌ లాంటి సర్వీసులు ఇటీవ‌లి కాలంలో బాగానే ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అయితే, ఇలాంటి కొలువుల్లో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఉన్న‌ట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ త‌ర‌హా సేవ‌లు అందించినప్పుడు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంద‌ని చెప్తున్నారు. ఉద్యోగం చేసే వారి మ‌ధ్య ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో టీమ్‌‌మేట్స్‌‌, తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అంతేకాదు వాళ్ల మధ్య కనెక్షన్‌‌ దెబ్బతింటోందట‌. ప్రపంచవ్యాప్తంగా ఆరువేల మంది ఉద్యోగులపై జ‌రిపిన ఒక సర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. 

 

ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేయ‌డం వ‌ల్ల ‘ఈ కంపెనీలో నేను పని చేస్తున్నాను. ఈ పనిని నేను చేయగలను. ఈ టీంను సమర్థవంతంగా నేను లీడ్‌‌ చేయగలను’.. ఇలా ఎన్నో విషయాలు అవ‌గాహ‌న‌లోకి వ‌స్తాయ‌ట‌. అదే...వ‌ర్క్ ఫ్రం హోం, పార్ట్ టైం, ఫ్రీలాన్స్‌లో..ఒకరికి ఒకరు పరిచయం లేకపోవడం, నమ్మకం లేకపోవడం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని నిపుణులు అంటున్నారు. అయితే, దీనికి ప‌రిష్కారం ఉద్యోగం మానేయ‌డ‌మో..ఇంకోటో కాదు..టెక్నాల‌జీని వినియోగించుకోవ‌డం.

 

టెక్నాల‌జీని ఎలా వినియోగించుకోవాల‌ని...విష‌యానికి వ‌స్తే... మెయిల్స్‌‌ పెట్టినప్పుడు  గుడ్‌‌ మార్నింగ్, గుడ్‌‌  నైట్‌‌ లాంటి  చిన్న చిన్న పలకరింపుల వల్ల కో–వర్కర్స్‌‌ మధ్య రిలేషన్‌‌షిప్‌‌ డెవలప్‌‌ అవుతుంది. అప్పుడప్పుడూ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో అంద‌రూ మాట్లాడుకోవ‌డం కూడా మేలు చేస్తుంద‌ట‌. దీంతోపాటుగా మేనేజ్‌‌మెంట్‌‌ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయంటున్నారు. పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించడం కంటే పర్సనల్‌‌గా వాళ్లను కలవడం, ఎంప్లాయిస్‌‌ను ఒకరితో ఒకరు కాంటాక్ట్‌‌ అయ్యేలా చూసుకోవడం, ఇందుకోసం మీటింగ్‌‌లను వేదికగా చేసుకోవ‌డం వంటి చ‌ర్య‌ల‌తో...పార్ట్ టైం, ఫ్రీలాన్స్‌, వ‌ర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగుల మ‌ధ్య గ్యాప్ త‌గ్గుతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: