మనిషి యొక్క జీవనానికి ఆకలి దప్పులతో పాటు శృంగారం కూడా తప్పనిసరి అనేది మనకు తెలిసిందే. వాస్తవానికి శృంగారాన్ని ఒక అవసరం మాదిరిగా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎంతో సంతృప్తిగా జరుపుకునే ఒక క్రియగా కొనేళ్ల క్రితం మానవుడు భావించేవాడు. పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ కూడా అప్పట్లో ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమానురాగాలు, మమకారాలు కలిగి ఉండేవారు. కనుకనే వారిద్దరి మధ్య రతి క్రీడ ఎటువంటి అరమరికల లేకుండా సాగేదని, 
అయితే రాను రాను కాలం మారుతున్న కొద్దీ మనిషికి శృంగారం అంటే కేవలం ఒక సాధారణ క్రియగా మారిపోయిందని, అదీకాక పెళ్లి చేసుకుంటున్న జంటల మధ్య సరైన ప్రేమ, అవగాహన వంటివి సరిగ్గా లేకపోవడంతో శృంగారంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, తత్ఫలితంగానే రోజురోజుకు విడాకుల కేసులు మరియు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు మానసిక నిపుణులు. అయితే అటువంటి సమస్యలు రాకుండా స్త్రీ, పురుషులిద్దరూ కూడా శృగారంలో పూర్తి సంతృప్తిని పొందాలి అనుకుంటే కొద్దిపాటి చర్యలు పాటిస్తే చాలట. ఇక వారు చెప్తున్న దానిని బట్టి, ముందుగా దంపతుల మధ్య ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ,వాత్సల్యం ఉండాలని, అలానే వాటితో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే ముఖ్యమైన ఒక పది సూత్రాలు పాటిస్తే ఎటువంటివారైనా శృంగారంలో చాలావరకు సంతృప్తిని పొందవచ్చని అంటున్నారు.

 

1) ముందుగా భార్యా భర్తలిద్దరికీ కూడా శృంగారం పట్ల వాస్తవిక అవగాహన కలిగి ఉండాలట. అందుకోసం పుస్తకాలు, ఇంటర్నెట్ వంటి వాటిలో వెతకవచ్చని సూచిస్తున్నారు.

2) అనగా, శృంగారం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశం అని భావించేలా స్త్రీ పురుషులిద్దరూ కూడా అవగాహన కలిగి ఉండాలని, అలానే 

3)రతి క్రీడా తరువాత ఇద్దరిలో ఎవరికైనా అసంతృప్తి ఉంటె, అవతలి వారికి వెంటనే చెప్పేయాలని, అలా చెప్పకపోవడం వలన, తమకు భావ ప్రాప్తి కలుగలేదనే భావన రాను రాను మరింత పెరుగుతుందని అంటున్నారు.

4)ఇక స్త్రీ పురుషులిద్దరూ కూడా శృంగారంలో పాల్గొనే ముందు ఫోర్ ప్లే విధానాన్ని అనుసరించాలని, దాని వలన ఆ వాంఛ మరింత పెరుగుతుందని అంటున్నారు.

5)ముఖ్యంగా పురుషులు శృంగార సమయంలో సిగరెట్, పాన్, మందు వంటివి శృంగారానికి ముందు తీసుకోకుండా ఉంటె బెటర్ అని, అలానే ఆ సమయంలో మన రూంలో మంచి  సుగంధ పరిమళాలు విరజిమ్మే సెంట్, అత్తరులు వంటివి వాడితే అది శృంగారంపట్ల మరింత ఆసక్తిని పెంచుతుందట.

6)అలానే శృంగారానికి ఒకటి లేదా రెండు గంటల ముందు పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే దాని వలన వీర్య వృద్ధి అధికం అవడంతో పాటు త్వరగా అలసట లేకుండా ఉంటుందట.    

7)ఇక ఎక్కువగా వీలైతే హనీమూన్ వంటివి ప్లాన్ చేసుకుని వేరే ఊళ్ళు వెళ్ళినట్లైతే, అటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ కూడా మనసువిపు మాట్లాడుకునే పరిస్థితులు ఎక్కువగా కలుగుతాయని చెప్తున్నారు.

8) ఇక కేవలం ఒకే భంగిమలో కాకుండా పలు భంగిమల్లో భార్యకు సంతృప్తినిచ్చేలా భర్త రతి క్రీడ జరిగిపితే మేలట.

9)అలానే మనతో పాటు అవతలివారికి కూడా ఏ రోజైనా శృంగారం పట్ల ఇంటరెస్ట్ లేనపుడు ఎక్కువగా ఇబ్బందిపెట్టకుండా ఉంటే మంచిదట.

10)అన్నిటికంటే ముఖ్యంగా శృంగార సమయంలో మనసు ఎంత నిర్మలంగా ఉంచుకుంటే దంపతులిద్దరికీ అంత మంచిదట. దాని వలన మనసు దేనిపైకి వెళ్లకుండా ఎక్కువగా భావప్రాప్తి కలిగేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు....!!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: