ఒక‌ప్పుడు గ్రీన్ టీ అంటే అంద‌రికీ తెలియ‌ని పానీయం. కానీ ఇప్పుడు ల‌క్ష‌లాది మందికి ఉద‌యం లేస్తూనే తీర్చుకోవాల్సిన ముఖ్య‌మైన కాల‌కృత్యాది అవ‌స‌రాల్లో గ్రీన్ టీ సేవ‌నం ఒక‌టైంది. గ్రీన్-టీ మొక్క యొక్క మొగ్గలు, ఆకులు, కాండాలను అనేక ప్రయోజనాల కోసం విరివిగా పయోగించబడుతున్నాయి. భూమి మీద లభించే పానీయాలలో ఇది చాలా ఆరోగ్యవంతమైనదని మంచి పేరును పొందింది. బరువు తగ్గించడం నుండి క్యాన్సర్ నివారణ వకూ ఈ గ్రీన్ టీ వివిధ రకాల ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అదే గ్రీన్ టీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

 

గ్రీన్ టి ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ దీని వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశలెక్కువ.దీనికి కారణం దీనిలో ఉండే కాటచిన్స్. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, గ్రీన్-టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత ఏర్పడుతుందని బయటపడింది. ఇది మీరు తినే ఆహారాల నుండి ఐరన్ను - మీ శరీరం సంగ్రహించే శక్తిని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికి,శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది..తద్వారా కడుపునొప్పి,కడుపులో మంట లాంటివి కలుగుతాయి. గర్భం ప్రారంభం దశలో కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అటువంటి కెఫిన్ పానియాల్లో గ్రీన్ టీ కూడా ఒక్కటి. 

 

కెఫిన్ ఉన్న గ్రీన్ టీ త్రాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే మోతాదు మించితే , మనస్సు మీద దుష్ర్పభావం చూపుతుంది. గ్రీన్ టీలో ఉండు అధిక యాంటీయాక్సిడెంట్స్ హార్మోనులను విడగొట్టడం వల్ల గ్రంథుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి, రోజుకు ఒకటి రెండు కప్పులకంటే ఎక్కువ తీసుకోకూడదు.  గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్ లో ఛేంజెస్ వచ్చే  అవకాశాలున్నాయి.హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అయితే చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: