బడికి వెళ్తే కోడి పిల్లలు ఉచితం, అరె ఇదెక్కడి వింత పథకం ఎక్కడ వినలేదే ఇంతవరకు అనుకుంటున్నారా, అవును మీరు విన్నది నిజమే కానీ ఇది మన దేశంలో కాదు. ఇండొనేసియాలోని బందంగ్ నగరంలో చదివే బడి పిల్లలకు ఉచితంగా కోడి పిల్లలను ఇస్తున్నారు. ఇక కోడి పిల్లలతో పాటు మిరప గింజల్ని కూడా పిల్లలకు ఇస్తున్నారు. ఈ కోడి పిల్లలతో పిల్లలు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా?. పిల్లలు చేయాల్సిందల్లా ఆ కోడి పిల్లల్ని మిరప గింజలతో మేపడమే. 

ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల (93 మైళ్ళు) దూరంలో ఉన్న నగరంలోని 10 ప్రాథమిక పాఠశాలలు మరియు రెండు జూనియర్ ఉన్నత పాఠశాలలకు 2 వేల కోడిపిల్లలు మరియు 1,500 మిరప విత్తనాలను అందిస్తున్నట్లు బాండుంగ్ ప్రభుత్వం తెలిపింది. ఇంతకు ఇంత వింత పథకాన్ని ఈ బడులలో ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా. ప్రపంచం మొత్తం విస్తరించిన స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ అక్కడకు కూడా పాకింది. దీంతో పిల్లలు ఆరుబయట ఆడుకోవడం మానేసి.. టీవీల ముందు, సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ జాఢ్యం ఎలా వదిలించాలా? అని ఆలోచించిన స్థానిక పెద్దలు ఈ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.

ఇక పిల్లలు చేయాల్సిందల్లా కోడి పిల్లలకు మేత వేయడం, వాటితో ఆడుకోవడమే, ఇలాంటి పనులు చెయ్యడం వాళ్ళ స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ వంటి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచవచ్చని ఇండోనేషియా లోని బాండుంగ్ నగర ప్రజలు మరియు పిల్లల తల్లితండ్రులు భావిస్తున్నారు. ఇక ఈ నగర ప్రజలు తీసుకున్న నిర్ణయానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నగర ప్రజల్ని పొగుడుతూ సోషల్ మీడియా లో ఒకటే పోస్టులు. పలు రాజకీయ నాయకులు సైతం వీళ్ళు అమలు చేస్తున్న ఈ పథకానికి జేజేలు కొడుతున్నారు. మరి మన దేశంలో కూడా ఇలాంటి పథకం ఒకటి పెడితే బాగుంటుందేమో కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: