మొబైల్‌ ఫోన్‌ ఒక అవసరంగా కంటే... ఒక వ్యసనంగా మారిపోవడం నేటి జీవన వైచిత్రి. చేతిలో మొబైల్‌, చెవిలో హెడ్‌ఫోన్స్‌ ఉన్నాయంటే... ఇక అదో ప్రపంచం. ఫోన్‌ పలకరింపులు, సంగీత సరిగమల నడుమ పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత తన్మయత్వం. బస్‌, రైళ్లు, ఇంట్లో, బయట, ఆఫీస్‌లో... ఎక్కడ ఎవరిని చూసినా ఇయర్‌ ఫోన్స్‌ వాడుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది యూత్‌కి హెడ్‌ఫోన్స్ శరీరంలో ఒక పార్ట్‌గా మారింది. మ్యూజిక్‌ని ఆస్వాదించడానికి.. గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి లేదా సినిమా చూడడానికి.. కారణం ఏదైనా.. యువత చెవిలో హెడ్‌ఫోన్స్‌ని దర్శనమిస్తున్నాయి.

 

వాటితో ఉపయోగాలు ఉన్నా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయి.  రోజులో ఐదు నిమిషాలకు మించి ఇయర్‌ ఫోన్స్‌ వినియోగిస్తే ప్రమాదమని ఓ నివేధిక‌ వెల్లడించింది. ఐదు నిమిషాలకు మించి హెడ్‌ఫోన్స్ వినియోగిస్తే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. హెడ్‌ఫోన్‌ వాడకం వల్ల చెవుల్లో తలెత్తే వేడి , తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువని తెలిపింది.

 

ఓ గంటపాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ సమయంలో బ్యాక్టీరియాలు 700 రేట్లు పెరుగుతున్నట్లు అధ్యయనంలో స్పష్టం చేశారు. అలాగే పెద్దపెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చెవిలోని కణాలు చాలా సున్నితంగా ఉంటాయని.. అవి దెబ్బతింటే తిరిగి వాటిని సరిచేయలేమంటున్నారు నిపుణులు. అదే విధంగా  60 డెసిబుల్స్‌ పైబడిన స్థాయి శబ్దాలను దగ్గరగా వినడం హానికరమనే విషయాన్ని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: