మన సాధారణ జీవితంలో ఒత్తిడి అనేది కూడా సాధారణం అనే చెప్పాలి. ఎందుకంటే మనం రోజు చేసే పనులు మనకు ఒత్తిడి కల్గించిన సరే తప్పదు కాబట్టి చేస్తుంటాం. అయితే ఈ ఒత్తిడి నుండి తప్పించుకోవాలంటే రోజుకు కనీసం అరగంటసేపు అయినా తోట పని చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. 

   

పచ్చని చెట్లు, విరబూసిన పూలమొక్కల మధ్య తిరగటం, వాటి బాగోగులు చూడటం వల్ల ఎంతటి ఒత్తిడైనా క్షణాల్లో తగ్గిపోతుందని మానసిక వైద్యులు చెప్తున్నారు. తోటపని ప్రయోజనకర౦గా, ఆసక్తికర౦గా ఉ౦డడమే కాక వ్యాయామశాలలో చేసే వ్యాయామ౦ కన్నా తోటపని వల్లే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

    

ఉదయం, సాయంత్రం వేళల్లో అరగంట పాటు తోటపని చేస్తే ఒంట్లోని అదనపు క్యాలరీలు తగ్గి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు, మూడ్‌ బాగోలేనప్పుడు అల్లా నేలను తవ్వడం, మొక్క నాటడం, నీళ్లు పోయడం వంటి పనులు కుదిరినప్పుడల్లా చేయడం వల్ల మనసు ఆనందంగా మారుతుంది.

   

వృద్ధులు తోటపని చేయటం వల్ల భవిష్యత్తు విషయ౦లో సానుకూల ధోరణి ఏర్పడి ఆయుః ప్రమాణం పెరుగుతుంది అని వైద్యులు చెప్తున్నారు.

   

ఆసుపత్రిలో చికిత్స తర్వాత రోగులు అక్కడి పచ్చని చెట్లను చూడగలిగినా మంచి ఫలితం ఉంటుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

   

పెరటి మట్టిలో ఉండే కొన్నిక్రిములు మనసుకు ఉత్సాహాన్నిచ్చే సెరటోనిన్‌ రసాయనాన్ని విడుదల చేస్తాయి. రోజూ లాన్‌లో కొద్దిసేపు గడిపినా ఒత్తిడి తగ్గిపోయి సరికొత్త, సృజనాత్మక ఆలోచనలు అంకురిస్తాయి. 

 

చూశారుగా.. మానసికంగా సమస్యలు ఉన్నవారు తోట పని చేస్తే ఎంత ఆరోగ్యంగా అవుతారు అనేది.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక గంట పాటు మొక్కల మధ్య గడపడానికి ప్రయత్నించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: