కాకరకాయ పేరు వింటేనే చాలామందికి కాదు కాదు ఎక్కువశాతం మందికి నచ్చదు. ఎందుకంటే ఇది చేదైన కయ కాబట్టి. ఎలా చేసిన సరే చేదు మాత్రం కచ్చితంగా ఉంటుంది. కాని ఈ చేదు కంటే కూడా ఈ కాకరకాయలో ఎక్కువశాతం ఔషధ గుణాలున్నాయని ఎవరు గుర్తించరు. కాకరకాయలో ఫాస్ఫరస్ అధికమోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. 

 

అయితే ఈ కాకరకాయ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావు అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఈ కాకరకాయవల్ల డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గిపోతారట.. ఆలా ఎలా తగ్గుతారు అనేది ఇక్కడ ఉన్న చిట్కాలు చదివి తెలుసుకోండి.. 

 

కాకరకాయ రసంలో సహజ సిద్దంగా మంటను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉండటంతో శరీరంలో చెడు క్రొవ్వుల స్థాయిలను తగ్గించడంలో కాకరకాయ మొదటి స్థానంలో ఉంది. 

 

కాకరకాయ గుండెపోటును, స్ట్రోక్ ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గించేస్తుంది. శరీరంలోని సోడియం అధికంగా గ్రహించడంతో పాటు, పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. 

 

ఈ కాకరకాయ అలెర్జీలు నయం చేయడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా బాగా సహాయపడతాయి. కాకరకాయలో ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తోపాటు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కూడా భారీగా ఉన్నాయి.

 

కాకరకాయ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో నిండి ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరిచి కడుపు నిండిన అనుభూతికి లోనవడం ద్వారా అతిగా తినడాన్ని నిరోధించి తృప్తిని పెంచుతుంది. 

 

కాకరకాయ రసంలో ఉండే విటమిన్లు, ఇతర ఖనిజాలు జీవక్రియల ప్రక్రియ వేగవంతం చేయడంలో దోహద పడి క్యాలరీలు, కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటుంది, వీటి తద్వారా బరువు తగ్గడంలో కాకరకాయ ఎంతో సహాయం చేస్తుంది.

 

చూశారుగా.. చాలా ఈజీగా బరువు తగ్గచ్చు.. అయితే మొదట కాకరకయా కాస్త చేదుగా ఉన్న తర్వాత దాని లాభాలలానే అది కూడా తియ్యగా మారిపోతుంది. అయితే ఆలా మారుతుంది అని ఎక్కువా మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో హానికరం వైద్యులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: